ఏపీ కేబినెట్ భేటీ అజెండా ఫిక్స్ చేసిన సాక్షి..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి మండ‌లి స‌మావేశం ఎందుకు జ‌రుగుతోందో వైకాపా ప‌త్రిక సాక్షి డీకోడ్ చేసింది! ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏ అజెండాతో మీటింగ్ పెడుతున్నారో కూడా సాక్షి చెప్పేసింది. రాష్ట్రంలో ఎండ‌ల తీవ్రత‌, నీటి ఎద్ద‌డి ప‌రిస్థితులు, ఫొని తుఫాను, ఉపాధి హామీ… ఈ అంశాల‌పై అత్య‌వ‌స‌రంగా చ‌ర్చించాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది ఏపీ స‌ర్కారు అజెండా. ఇదే ప్ర‌తిపాద‌న‌ను ఈసీకి పంపి మంత్రి మండ‌లి స‌మావేశానికి అనుమ‌తులు కోరింది. అయితే, సాక్షి చెబుతున్న‌ది ఏంటంటే… కేవ‌లం ఉపాధి హామీ ప‌నుల బిల్లుల కోసం మాత్ర‌మే కేబినెట్ పెడుతున్నార‌ట! ఆ బిల్లుల‌పై ఆమోద ముద్ర ప‌డిపోతే… టీడీపీ నేత‌ల‌కు అందాల్సిన ముడుపుల‌కు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌నేది చంద్ర‌బాబు వ్యూహ‌మ‌ట‌!

గ‌డ‌చిన ఆరునెల‌ల్లోనే దాదాపు రూ. 1920 కోట్ల పనికి ఆహారం ప‌థ‌కం బిల్లుల‌ను ప్ర‌భుత్వం సిద్ధం చేసేసింద‌ని సాక్షి చెప్పింది. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ప్ర‌భుత్వం మారితే, ఈ బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జ‌రుగుతుంద‌నీ, అందుకే వ్యూహాత్మ‌కంగా ఈ కేబినెట్ మీటింగ్ ని చంద్ర‌బాబు ఏర్పాటు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. నిజానికి, ఈ ప‌నికి ఆహారం ప‌థ‌కం బిల్లులు నేరుగా పంచాయ‌తీల‌కు వెళ్తాయి. కానీ, గ‌డ‌చిన ఐదేళ్లుగా పంచాయ‌తీల పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేత‌లు ఈ బిల్లుల్లో వాటాలు ద‌క్కించుకుంటున్నార‌ని సాక్షి రాసింది. అదెలాగో స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. పంచాయ‌తీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గాల్సి ఉంది కాబ‌ట్టి, అసెంబ్లీ ఫ‌లితాల త‌రువాత ఆ ఎన్నిక‌లు జ‌రిగితే… స‌ర్పంచులు మారితే… టీడీపీ బండారం బ‌య‌ట‌ప‌డిపోతుంద‌న్న ఆతృత‌తోనే ఈ కేబినెట్ లో ప‌నికి ఆహారం ప‌థ‌కం బిల్లుల‌ను ఆమోదింప‌జేయాల‌ని చంద్ర‌బాబు చూస్తున్నార‌ట‌.

నిజానికి, ప‌నికి ఆహారం ప‌థ‌కం బిల్లుల చెల్లింపులు పంచాయతీల ద్వారా జ‌రుగుతాయి. అంటే, నేరుగా పనిచేసిన వారికే సొమ్ము అందుతుంది. మ‌ధ్య‌లో నాయ‌కుల ప్ర‌మేయం లేకుండానే ఈ వ్య‌వ‌స్థ ఉంది. అలాంట‌ప్పుడు, స‌ర్పంచులుగానీ ఇత‌ర నేత‌లుగానీ మ‌ధ్య‌లో ఎలా జోక్యం చేసుకుంటారు? ఐదేళ్లుగా టీడీపీ నేత‌ల దోపిడీ కొన‌సాగుతోంద‌ని రాసేశారే త‌ప్ప‌… అదెలా జ‌రుగుతోందో స్ప‌ష్టంగా చెప్పాల్సింది! ప్ర‌భుత్వం మారితే బిల్లుల చెల్లింపు ఎందుకు ఆల‌స్యం అవుతుంది? ప‌నిచేసిన కూలీలు ఊరుకుంటారా? ఇంకోటి… పెండింగ్ లో ఉన్న ఇత‌రల బిల్లుల‌న్నీ టీడీపీ నేత‌ల జేబులు నింపేవే అని టోకున ఆరోపించే ముందు… అదెలాగో కూడా వివ‌రంగా రాస్తే అంద‌రికీ స్ప‌ష్టంగా అర్థ‌మౌతుంది క‌దా! ఈ కేబినెట్ మీటింగ్ లో క‌రువు ప‌రిస్థితుల‌కు ప్రాధాన్య‌త ద‌క్కాల‌నిగానీ, నీటి ఎద్ద‌డి ప‌రిస్థితుల‌పై ప్ర‌భుత్వం ఆలోచించాల‌నే సూచ‌న‌లుగానీ స‌ల‌హాలుగానీ సాక్షి ప‌త్రిక‌ చెయ్య‌క‌పోవ‌డం విశేషం. వారి దృష్టిలో కేబినెట్ భేటీ అంటే… సొంత బిల్లుల ఆమోదం కోసం టీడీపీ ఏర్పాటు చేసుకుంటున్న కార్య‌క్ర‌మంగానే క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close