నాగచైతన్యతో విడిపోయాక… తన కెరీర్‌పై మరింత శ్రద్ధ పెట్టింది సమంత. వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది. తన చేతిలో రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. రెండూ లేడీ ఓరియెంటెడ్ కథలే. ఇప్పుడు తాజాగా హాలీవుడ్ సినిమాలో సైతం నటించబోతోందన్న టాక్ వినిపిస్తోంది. `అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్` అనే సినిమాలో సమంత కీలక పాత్ర పోషిస్తోందట. దాంతో పాటు ఓ ఐటెమ్ గీతంలోనూ నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. `పుష్ప`లో ఓ ఐటెమ్ సాంగ్ ఉంది. ఆ పాట కోసం చాలామంది కథానాయికల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పూజా హెగ్డే, తమన్నాలను సంప్రదించారు. చివరికి సమంత దగ్గర ఆగారని తెలుస్తోంది. `రంగస్థలం`లో సమంత కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. సుకుమార్ కి ఆ సెంటిమెంట్ బాగా టెమ్ట్ చేస్తోంది. పైగా తమన్నా, పూజా ఇది వరకే ఐటెమ్ గీతాల్లో నటించారు. సమంత అయితే ఒక్క ఐటెమ్ గీతం కూడా చేయలేదు. సమంతతో ఈ పాట చేయిస్తే గనుక.. కొత్తగానే ఉంటుంది. ఈనెల 26న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ పాటని తెరకెక్కించబోతున్నారు. సమంత ఎంట్రీపై చిత్రబృందం ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన ఇచ్చేఅవకాశం వుంది.