ఈ నెలలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని … ఐఏఎస్‌లో సర్వీస్‌లో చేరినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉరకలెత్తేలా పని చేసేవారో.. ఎస్‌ఈసీగా బాధ్యతలు కూడా అదే ఉత్సాహంతో నిర్వహిస్తున్నారు. ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే నోటిఫికేషన్ ఇచ్చేసి.. తనది మామూలు స్పీడ్ కాదని నిరూపించేసిన ఆమె… ఏప్రిల్ నెలాఖరులోపు..పెండింగ్‌లో ఉన్న స్థానిక ఎన్నికలు ఏవైనా ఉంటే వాటన్నింటిని కంప్లీట్ చేయాలనిలక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం కసరత్తు చేస్తున్నారు. పరిషత్ ఎన్నికలను రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క రోజులో పెట్టేయాలన్న సాహసోపేత నిర్ణయం తీసుకున్న ఆమె … కోర్టు కేసులను కూడా లైట్ తీసుకుంటున్నారు.

జరిగినవి కాకుండా..రాష్ట్రంలో ఇంకా 32 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కోర్టు కేసులతో పాటు వివిధ కారణాల వల్ల వీటికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. వాటన్నింటిని పరిష్కరించి.. నెలాఖరులోపు.. ఎన్నికలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో సాహ్ని ఉన్నారు. సాధారణంగా కోర్టుల్లో కేసులు ఉంటే.. కోర్టు తీర్పులు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం సహజంగానే జరుగుతుంది.కానీ నీలం సాహ్ని మాత్రం… కోర్టుల్లో కేసులు ఉన్నప్పటికీ నిర్ణయం తీసేసుకుని… ఆ తర్వాత ఎస్‌ఈసీ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి లేదన్న వాదనను హైకోర్టులో వినిపిస్తున్నారు.

పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ కొనసాగింపు విషయంలో జరిగింది ఇదే. దీంతో కోర్టుల్లో కేసులున్నప్పటికీ.. మిగతా కార్పొరేషన్లు.. మున్సిపాలిటీల్లోనూ ఈ నెలాఖరుకల్లా ఎన్నికలు నిర్వహించేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా … పని చేసిన నీలం సాహ్ని.. కోర్టులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని.. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కానీ వారి విమర్శలన్నీ రాజకీయ ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close