1976లో చేరిన`సెక్యులరిజం’ ప్రామాణికమా ?

పార్లమెంట్ లో రాజ్యాంగదినోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చ మొదలైంది. చాలా సంతోషించదగ్గ విషయమే ఇది. రాజ్యాంగ నిర్మాతలు ఏ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని నిర్మించారో ఆ స్ఫూర్తి అడుగంటుతున్న నేపథ్యంలో రెండురోజులు చర్చకు కేటాయించడం ముదావహం. అయితే, ఈ చర్చ దేశప్రజల మూలాలు, కూసాలు కదిలించే దిశగా తిరగబోతున్నదా? సెక్యులర్, నాన్ సెక్యులర్ దగ్గర కథ ప్రారంభమైనా మల్లికార్జున ఖర్గెే వ్యాఖ్యలతో చర్చదారితప్పే పరిస్థితి ఏర్పడింది. ఉత్తర-దక్షిణ భారతవాసుల మూలవాసుల కథలకు రెక్కలు తొడగబోతున్నారు.

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో `అసహనం’ గురించి కూడా చర్చ జరగాల్సి ఉంది. ఇవ్వాళ కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తన వ్యాఖ్యలతో `అసహనం’చర్చ కూడా ప్రారంభించినట్లయింది. రాజ్ నాథ్ సింగ్ సెక్యులరిజం (లౌకికవాదం) గురించి చాలా లోతుగా మాట్లాడారు. అసలు లౌకికవాదమన్న పదాన్నే తప్పుగా అర్థం చేసుకుంటున్నారనీ, దాన్ని సరైన రీతిలో ఉపయోగించడంలేదని, ఈ పదానికి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని విమర్శించారు. ఏది లౌకికం, మరేది అలౌకికం అన్నది సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారనీ, ముందు ఈ గందరగోళం తొలిగిపోవాలని ఆయన భావించారు. ఇవ్వాళ సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తడానికి ఇదే కారణమని కూడా ముక్తాయింపు ఇచ్చారు.

భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ `లౌకిక’, `సామ్యవాదం’ అన్న పదాలను రాజ్యాంగంలో చేర్చాలని అనుకోలేదన్నది బిజెపీ వాళ్ల వాదన. సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగ పీఠికలో తర్వాత చేర్చిన మాట నిజమే.1976లో ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగానికి 42వ సవరణగా పీఠికలో “భారత్ ఒక లౌకిక (సెక్యులర్) రాజ్యము” అని చేర్చారు. సెక్యులర్ అన్న పదాన్ని హిందీలో అనువదించడంలోనే పొరపాటు జరిగిందని మంత్రి అనగానే ప్రతిపక్షనాయకుల నుంచి నిరసన వ్యక్తమైంది.

మనం ఏలాంటి నమ్మకంతోనైనా ఉండవచ్చు, మనమంతా భారతదేశ ప్రభుత్వాన్ని గౌరవించాల్సిందే, ఇప్పుడు ఇన్నాళ్లకు సెక్యులర్ అన్న పదాన్ని పట్టుకుని కోడిగుడ్డు మీద ఈకలు పీకే పని మంచిది కాదని శశి థరూర్ మండిపడ్డారు.

రాజ్యాంగ దినోత్సవం పేరిట చర్చ తీసుకురావడంలో అసలు ఉద్దేశమేమిటో రాజ్ నాథ్ సింగ్ ప్రసంగం తేల్చిచెబుతున్నదనీ, ఆర్ఎస్ఎస్ సెక్యులర్ అన్న పదాన్ని జీర్ణించుకోలేదు కనుక, వీళ్లంతా కలిసి ఇండియాను హిందూదేశంగా మార్చాలనుకుంటున్నారన్నది వామపక్షనేత సీతారాం ఏచూరి విమర్శ. పార్లమెంట్ అధికారిక బిల్లుల హిందీ ప్రతుల్లో సెక్యులర్ అన్న పదం దగ్గర ధరమ్ నిర్పేక్ష్ అనే ఉండటంపై గందరగోళం సృష్టించడం సరైనదికాదని ఆయనిచ్చిన వివరణ.

ఈ చర్చలో వెంకయ్యనాయుడు లాజికల్ గా మాట్లాడారు. `ఎవరెవరు తమ స్వార్ధంకోసం రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నారో, అలాగే మరెవరెవరు ప్రజలను జైళ్లకు పంపి మరీ రాజ్యాంగాన్ని సవరించారో ఈ దేశానికి బాగా తెలుసు, ఇది కాంగ్రెస్ చరిత్ర. అలాంటివాళ్లకు విమర్శించే నైతిక హక్కులేదు’ అని వెంకయ్యనాయుడు అన్నారు. నెమ్మదిగా ఈ చర్చ దేశంలోని అనసహనపు వాతావరణంవైపు తిరిగింది. గత కొద్ది నెలలుగా దేశంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగిపోతున్నాయని సోనియాగాంధీ మండిపడ్డారు.

సెక్యులరిజం చరిత్ర

సెక్యులరిజం అనే పదాన్ని మొదటిసారిగా బ్రిటిషు రచయిత ‘జార్జి హోలియోక్’ 1846 లో ఉపయోగించారు. అప్పటినుంచి ఒక`స్వతంత్ర’ ఆలోచనగా దీన్ని అందిపుచ్చుకున్నారు. మతం నుంచి సమాజాన్ని వేరుచేసి, సమాజాభివృద్ధికొరకు హోలియెక్ ఇచ్చిన సూచనగానే ఈ వాదనను అర్థంచేసుకోవాలి. ఈ వాదనలో ఆయన మతాన్ని విమర్శించడంగానీ లేదా ఘాటైనవ్యాఖ్యలు చేయడం గాని చేయకపోవడం గమనార్హం. తనవాదనలో “సెక్యులరిజం, క్రైస్తవ మతానికి వ్యతిరేకి కాదు, ఇదో స్వేచ్ఛాయుత ఆలోచన” అని చాలా స్పష్టంగా చెప్పారు. వాటన్నింటికీ అతీతంగా మనం అందిపుచ్చుకున్న `సెక్యులర్’ వాదనతో విచిత్రమైన నాట్యం చేస్తున్నాము. చివరకు ఇది దేశాభివృద్ధికే ఆటంకంగా మారిపోతున్నదన్న విమర్శలు వచ్చేస్థాయికి ఎదిగింది.

కుహనా లౌకిక వాదం

లౌకికతత్వంపై హిందువుల్లో కొందరి వాదన ఇది. దేశంలో సెక్యులరిజం పేరుతో వోటుబ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయనీ, అత్యధికశాతమున్న హిందువుల మనోభావాలు ఈ లౌకికవాద ముసుగుతో దెబ్బతింటున్నాయన్నది ఓ పెద్ద విమర్శ. ప్రస్తుత అసహన ధోరణులకు కూడా ఈ కుహనా లౌకిక వాదుల చర్యలే కారణమని హిందూమతాన్ని సమర్థించే సంస్థలు, పార్టీలు వాదిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం పార్లమెంట్ లో రాజ్యాంగదినోత్సవం సందర్భంగా కొనసాగుతున్న చర్చ కచ్చితంగా అనేక మలుపులు తిరిగే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే రాజ్ నాథ్ సింగ్ లేవనెత్తిన సెక్యులర్ పద ప్రయోగం వ్యవహారం దుమారంరేపింది. దీనికితోడు కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖార్గే ఆర్య-ద్రవిడ వివాదం లేవనెత్తారు. దేశంలో అసలు ఎవరు మూలవాసులు అన్న సమస్యతలెత్తుతోంది.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ – సోషలిస్టు, సెక్యులర్‌ అనే మాటను రాజ్యాంగంలో చేర్చాలనుకున్నారని, అప్పటి వాతావరణంలో ఆ పని కుదరలేదని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బాబా సాహేబ్‌ దేశం విడిచి వెళ్లాలనుకున్నారని చెప్పడం తప్పని, ఆయన ఈ దేశంలో మూలవాసులని (aboriginals) ఖర్గే వ్యాఖ్యానించడంతో భారత నాగరికత కథ తవ్వినట్లయింది. ఉత్తర, దక్షిణ భారతవాసుల్లో అసలు ఎవరు మూలవాసులు, ఎవరుకారన్న సున్నితమైన అంశం వివాదాస్పద చర్చలకు దారితీయవచ్చు.

మొత్తానికి రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా పార్లమెంట్ లో ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన రెండురోజుల చర్చ చివరకు చినికిచినికి గాలివానగా మారబోయే సూచనలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ దేశంలో అసహనం పేరుకుపోయిందంటూ చర్చ మొదలుపెట్టాలని అడగకముందే, అంతకంటే కీలకమైన అంశాలపై వాడివాడి చర్చలు జరగబోతున్నాయి. ఈ తరహా చర్చ అర్థవంతంగా సాగుతుందా, లేక దేశ ప్రజలను మరింత గందరోగళంలో పడేస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close