సాహో: స్టైల్ మాత్ర‌మేనా.. ఇంకేమైనా ఉందా?

‘షేడ్స్ ఆఫ్ సాహో’ పేరుతో మ‌రో టీజ‌ర్ వ‌చ్చేసింది. ప్ర‌భాస్ ని ఒక్క ఫ్రేములో చూసినా చాలు..అదే ప‌ది వేలు అనుకునేవాళ్ల‌కు ఇది మంచి గిఫ్టే! ఈ సినిమాలో యాక్ష‌న్ ఏ రేంజులో ఉంటుందో, బుల్లెట్లు ఏ స్థాయిలో దిగుతాయో.. చెప్ప‌డానికి మ‌రో ఉదాహ‌ర‌ణ దొరికేసిన‌ట్టైంది. ప్ర‌భాస్‌, శ్ర‌ద్దా క‌పూర్‌ల కంటే.. మిష‌న్ గ‌న్‌లూ, ఫైట‌ర్లు, టెక్నీషియ‌న్లు ఎక్కువ‌గా క‌నిపించారీ టీజ‌ర్‌లో. ‘సాహో’ టీమ్ కాన్సెప్ట్ అదే కాబ‌ట్టి.. ఓకే అనేసుకోవాలంతే.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన రెండు మేకింగ్ వీడియోలూ.. ఈ సినిమాలో ఉండే స్టైల్‌నీ, యాక్ష‌న్‌నీ ఫోక‌స్ చేస్తూ వ‌చ్చాయి. క‌థ‌, క్యారెక్ట‌రైజేష‌న్‌కి సంబంధించిన ఒక్క క్లూ కూడా ఇవ్వ‌లేదు. ఈ సినిమా విడుద‌ల‌కు ఆరు నెల‌ల స‌మ‌యం ఉంది కాబ‌ట్టి… ఇప్పుడే వాటి గురించి చెప్పాల్సిన ప‌ని లేదు కూడా. కాక‌పోతే స్టైల్‌, యాక్ష‌న్‌తో పాటు ఇంకేదో ఉంది.. అనే హింట్ ఇవ్వ‌గ‌లిగితే బాగుణ్ణు. ఈ సినిమా మేకింగ్ అంత‌ర్జాతీయ స్థాయిలో ఉంటుంద‌న్న ఓ అంచ‌నాకు ఇప్ప‌టికే ప్రేక్ష‌కులు, ప్ర‌భాస్ అభిమానులూ వచ్చేశారు. ‘ఇంత క‌ష్ట‌ప‌డుతున్నారు కాబ‌ట్టే.. ఈ సినిమా లేట్ అవుతోంది…’ అని స‌ర్ది చెప్పుకొనేంత స్ట‌ఫ్ ‘షేడ్స్ ఆఫ్ సాహో 2’ వ చాప్ట‌ర్‌లో క‌నిపించింది. ఆ ర‌కంగా ‘సాహో’ టీమ్ స‌క్సెస్ అయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.