ఫ్యాన్‌… ఫ్యాన్స్ కోస‌మేన‌ట‌

షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్ సినిమా ఈరోజు విడుద‌లైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా తొలి రోజు వ‌సూళ్లు అద‌ర‌గొట్టే స్థాయిలోనే వ‌స్తున్నాయి. అయితే రివ్యూలు మాత్రం.. ఇది ‘సో.. సో..’ సినిమా అని తేల్చేస్తున్నాయి. కేవ‌లం షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కి మాత్ర‌మే అని ట్యాగ్ లైన్ ఇస్తున్నాయి. షారుఖ్ మ‌రోసారి… బాక్సాఫీసుని అద‌ర‌గొడతాడు, పీకె రికార్డులు కొల్ల కొడ‌తాడు అనుకొన్న‌వాళ్లంద‌రికీ ఇది నిరాశ క‌లిగించే విష‌య‌మే.

అయితే షారుఖ్ న‌ట‌న‌.. రెండు పాత్ర‌ల్లో షారుఖ్ చూపించిన వైవిధ్యం అద్భుతం.. అని విమ‌ర్శ‌కులు సైతం మెచ్చుకొంటున్నారు. ఫ‌స్టాఫ్‌ని ఇంట్ర‌స్టింగ్ గా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు మనీష్ శర్మ.. ద్వితీయార్థంలో త‌డ‌బ‌డ్డాడ‌ని చెబుతున్నారు. ఫ్యాన్‌కీ, స్టార్‌కీ మ‌ధ్య ఈగో ప్రాబ్ల‌మ్స్ ఎందుకొచ్చాయో.. స‌రిగా చూపింక‌లేక‌పోయాడ‌ట‌. అయితే యాక్ష‌న్ ఘ‌ట్టాల్ని మాత్రం హాలీవుడ్ స్థాయిలో తీశాడ‌ట‌. షారుఖ్ గ‌త చిత్రం దిల్‌వాలేతో పోలిస్తే… ఈ సినిమా చాలా బెట‌ర్ అని కూడా చెబుతున్నారు. అదొక్క‌టి చాల‌దూ.. ఈ సినిమా బాక్సాఫీసుని షేక్ చేయ‌డానికి. యావ‌రేజ్ టాక్ తెచ్చుకొన్న ఫ్యాన్‌ని ఇప్పుడు సూప‌ర్ హిట్ గా మార్చాల్సింది ఫ్యాన్సే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close