ఆ డైరక్టర్ కు శర్వా నో

ఒక సినిమా హిట్ కొడితే సరిపోదు. హిట్ మీద హిట్ కొడుతూనే వుండాలి. లేదూ అంటే పక్కన పెట్టేస్తారు. దర్శకుడు చందు మొండేటి పరిస్థితి అదే ఇప్పుడు. సవ్యసాచి ఫ్లాపుతో చేతిలో అడ్వాన్స్ లు మిగిలాయి కానీ, సినిమా కనిపించడం లేదు. ఆఖరికి శర్వానంద్ ను సెట్ చేసుకోవాలని కిందా మీదా ప్రయత్నించారు. నిర్మాత చెరుకూరి సుధాకర్ తో కలిసి ప్రాజెక్టు రెడీ చేయాలనుకున్నారు.

కానీ శర్వానంద్ పాజిటివ్ గా టర్న్ కాలేదని తెలుస్తోంది. శర్వా స్పెయిన్ లో షూటింగ్ లో వుండగా, అక్కడకు వస్తామని కబురు చేస్తే, ఆయన రావద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఇప్పట్లో తన డేట్ లు ఖాళీ లేవని, ఖాళీ అయ్యాక చూద్దామని చెప్పేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఇక చేసేది లేక, నిఖిల్ లో కార్తికేయ 2 చేసే అగ్రిమెంట్ మీద చందు మొండేటి సైన్ చేసేసారు. ఇప్పుడు మళ్లీ ఎక్కడ ప్రారంభించారో అక్కడికి వచ్చేసినట్లే. కార్తికేయతో ప్రారంభించి, కార్తికేయ 2 దగ్గరకు వచ్చారు. ఇది హిట్ కొడితేనే మళ్లీ మంచి ప్రాజెక్టు చేతిలోకి వచ్చేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close