మళ్ళీ ఠాగూర్ జోడీ : చిరు తో శ్రీయ

చిరంజీవి 150వ చిత్రంలో ఆక‌ర్షణ‌ల‌కు కొద‌వ లేదు. 150 అంకే.. ఓ పెద్ద మ్యాజిక్ ఫిగ‌ర్‌. ఈ చిత్రానికి రామ్‌చ‌ర‌ణ్ నిర్మాతగా వ్యవ‌హ‌రించ‌డం మ‌రో ఆక‌ర్షణ‌. ఇందులో చ‌ర‌ణ్ ఓ పాట‌లో క‌నిపిస్తాడ‌న్న ప్రచారం జోరుగా సాగుతోంది. హీరోగా సెటిల్ అయిపోయిన సునీల్ చిరు కోసం ఓ కీల‌కమైన పాత్ర చేయ‌డానికి ఒప్పుకొన్నాడు. ఇప్పుడు ఖైది నెంబ‌ర్ 150వ‌లో మ‌రో స్టార్ వ‌చ్చి చేర‌బోతోంది. క‌థానాయిక శ్రియ ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్రలో క‌నిపించ‌బోతోంద‌ని స‌మాచారం. ఇది వ‌ర‌కు ఠాగూర్ చిత్రంలో చిరు – శ్రియ జోడీగా న‌టించారు. ఆ చిత్రానికి ద‌ర్శకుడు కూడా వినాయ‌క్‌నే. ఇప్పుడు మ‌ళ్లీ చిరుతో వినాయ‌క్ చేస్తున్న సినిమాలో శ్రియ‌ని తీసుకొచ్చే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఖైది నెం.150లోని ఓ పాత్ర కోసం శ్రియ‌ని సంప్రదించిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల భోగ‌ట్టా.

”శ్రియ‌ని అడిగిన మాట వాస్తవ‌మే. అయితే త‌న నిర్ణయం తెల‌ప‌డానికి కాస్త స‌మ‌యం కావాల‌ని చెప్పింది. శ్రియ నిర్ణయం ప్రక‌టించాక‌… అధికారికంగా వెల్లడిస్తాం” అని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. చిరు సినిమాలో శ్రియ ఖాయ‌మైతే నిజంగా శ్రియ పంట పండిన‌ట్టే. ఎందుకంటే అటు బాల‌య్య వందో చిత్రంలో.. ఇటు చిరు 150వ సినిమాలోనూ త‌నే క‌నిపిస్తుంది. సంక్రాంతికి వ‌చ్చే రెండు సినిమాల్లోనూ శ్రియ‌నే ఉండ‌బోతోంది. ఇంత‌కంటే ఆనందం ఇంకేం ఉంటుంది? దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కేథ‌రిన్ ప్రత్యేక గీతంలో న‌ర్తించ‌బోతున్నట్టు తెలుస్తోంది. 2017 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం స‌న్నాహాలు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close