శ్యామ్ సింగ‌రాయ్ టీజ‌ర్‌: అక్ష‌రం ప‌ట్టుకున్న ఆయుధం

నాని సినిమా అంటే కావ‌ల్సినంత ఫ‌న్‌. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌. ఇదే క‌దా ఇన్నాళ్లూ చూశాం..?! నానిని ఓ సీరియ‌స్‌, ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో చూస్తే ఎలా ఉంటుందో మ‌న‌కిన్నాళ్లుగా తెలీలేదు. అది చెప్ప‌డానికే `శ్యామ్ సింగ‌రాయ్‌` తీసిన‌ట్టు ఉన్నారు. నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లు. రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈనెల 24న విడుద‌ల కానుంది. ఈరోజు టీజ‌ర్ బ‌య‌ట పెట్టారు.

”అడిగే అండ లేద‌ని
క‌ల‌బ‌డే కండ‌లేద‌ని
ర‌క్షించాల్సిన దేవుడు రాక్ష‌సుడిగా మారుతుంటే..
కాగితం క‌డుపుని చీల్చుకుని పుట్టి
రాయ‌డ‌మే కాదు.. కాల రాయ‌డం కూడా తెలుస‌ని
అక్ష‌రం ప‌ట్టుకున్న ఆయుధం పేరే… శ్యామ్ సింగ‌రాయ్‌” అంటూ ఒకే ఒక్క డైలాగ్ లో శ్యామ్ సింగ‌రాయ్ క్యారెక్ట‌ర్ బ‌య‌ట‌పెట్టేశారు. క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో సాగే పీరియాడిల్ డ్రామా ఇది. ఆ వాతావర‌ణాన్ని క‌ళ్ల‌కు క‌ట్టారు.

”స్త్రీ ఎవ‌రికీ దాసీ కాదు.. ఆఖ‌రికి దేవుడికి కూడా” అనే డైలాగ్ నాని బెంగాలీలో చెప్పాడు. దీన్ని బ‌ట్టి.. ఏదో బ‌ల‌మైన సామాజిక నేప‌థ్యం ఈ క‌థ‌లో మిళిత‌మై ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. సాయి ప‌ల్ల‌విని క్లాసిక‌ల్ డాన్స‌ర్ గా చూపించారు. కృతితో ఓ రొమాంటిక్ షాట్ కూడా ఉంది. విజువ‌ల్ గా.. సినిమాని ఉన్న‌త‌మైన సాంకేతిక నైపుణ్యంతో తెర‌కెక్కించార‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది. మిక్కీ జే మేయ‌ర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ విజువ‌ల్స్ కి మ‌రింత బ‌లాన్ని ఇచ్చింది. మొత్తానికి.. నాని నుంచి మ‌రో డిఫ‌రెంట్ సినిమా చూడ‌బోతున్నామ‌న్న భ‌రోసా టీజ‌ర్ క‌లిగించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.