డిజే టిల్లు – 2 కూడా ఉంది

తెలుగులో ఫ్రాంచైజీలు చాలా త‌క్కువ‌. మ‌నీ, మ‌నీ – మ‌నీ, ఎఫ్ 2, ఎఫ్ 3.. ఇలా కొన్ని ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే ఇప్పుడు డిజే టిల్లు ఫ్రాంఛైజీ ని కొన‌సాగించే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. ఈ విష‌యాన్ని హీరో.. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ బ‌య‌ట‌పెట్టాడు.

“డీజే టిల్లు చాలా బాగా వ‌చ్చింది. సీక్వెల్ కి అవ‌స‌ర‌మైనంత స‌రుకు ఈ క‌థ‌లో ఉంది. డీజే 2 కూడా ప్లాన్ చేస్తున్నాం. దీన్నో ఫ్రాంచైజీ గా కొన‌సాగిస్తే బాగుంటుంద‌నుకుంటున్నాం. చూద్దాం.. డీజే టిల్లు హిట్ట‌యితే ఆటోమెటిగ్గా.. అన్నీ జ‌రిగిపోతాయి“ అని చెప్పుకొచ్చాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ఈనెల 12న విడుద‌ల అవుతోంది. ఈ సినిమా అవుట్ పుట్ చూసి త్రివిక్ర‌మ్ కూడా సంతృప్తిని వ్య‌క్తం చేశార‌ట‌. ”సినిమా హిట్టు.. పక్కా. ఏ రేంజ్ అవుతుందో చూడాలి..” అని చెప్పాడ‌ట‌. దాంతో.. చిత్ర‌బృందం ఫుల్ హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోయింది.

నిజానికి ఈ సినిమా టైటిల్ డీజే టిల్లు కాదు. ‘న‌రుడి బ‌తుకు న‌ట‌న‌’. చివ‌రికి `డీజే టిల్లు`గా మార్చారు. ఈ విష‌య‌మై.. సిద్దూ మాట్లాడుతూ “మా సినిమా గురించి ఎవ‌రు ఎప్పుడు అడిగినా… `టిల్లు ఎప్పుడు.. టిల్లు ఎప్పుడు` అనే అనేవారు. `న‌రుడి బ‌తుకు…`అని ప‌లికే లోపు స‌గం మంది.. అక్క‌డ్నుంచి వెళ్లిపోతారు. అలా వుంది ఆ టైటిల్. అందుకే చివ‌రి క్ష‌ణాల్లో డీజే టిల్లుగా మార్చాం. టైటిల్ మార్చ‌డం కూడా చాలా క‌లిసొచ్చింది“ అన్నాడు. ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు కూడా సిద్దూనే స‌మ‌కూర్చాడు.

పుట్టు మ‌చ్చ‌ల ప్ర‌శ్న‌.. మ‌ళ్లీ స్పందించిన హీరో

డీజే టిల్లు అన‌గానే.. ఎందుకో అంద‌రి చర్చా `పుట్టుమ‌చ్చ‌ల` ప్ర‌శ్న‌పైనే పోతోంది. సురేష్ కొండేటి అనే ఓ జ‌ర్న‌లిస్టు… మీడియా ముఖంగా “సినిమాలో హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలున్నాయని చెప్పించారు కదా, మరి రియల్ గా ఆ హీరోయిన్ కు ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా?“ అంటూ అభ్యంత‌ర‌క‌ర‌మైన ప్ర‌శ్న వేయ‌డంతో.. స్టేజీపై వాళ్లంతా స్ట‌న్ అయ్యారు. హీరో ఈ ప్ర‌శ్న‌ని అవాయిడ్ చేస్తూ త‌ప్పుకున్నా, సోష‌ల్ మీడియాలో ఈ ఉదంతంపై చాలా పెద్ద చ‌ర్చ న‌డిచింది. సురేష్ కొండేటిని దారుణంగా ట్రోల్ చేశారు. స‌ద‌రు హీరోయిన్ సోష‌ల్ మీడియాలో త‌న బాధ‌ని పంచుకుంది. హీరో కూడా ఓ ట్వీట్ చేశాడు. చివ‌రికి సురేష్ కొండేటి సారీ చెప్ప‌డంతో… ఈ వ్యవ‌హారం కాస్త స‌ద్దుమ‌ణిగింది.

ఇప్పుడు మ‌రోసారి ఈ పుట్టుమ‌చ్చ‌ట ప్ర‌శ్న చర్చ‌ల్లోకి వ‌చ్చింది. డీజే టిల్లు ఇంట‌ర్వ్యూల‌లో భాగంగా.. ఈ ప్ర‌శ్న‌పై అప్పుడు మీరు స్పందించ‌క‌పోవ‌డం త‌ప్పే క‌దా..? అవాయిడ్ చేయ‌కుండా ఉండాల్సింది క‌దా..“ అని జ‌ర్న‌లిస్టులు మ‌ళ్లీ ప్ర‌శ్న సంధించారు. “అవును. చాలామంది మిత్రులు నన్ను ఇదే అడిగారు. అప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వాల్సింది క‌దా.. అన్నారు. నేను ఆ ప్ర‌శ్న‌ని అవాయిడ్ చేశాను. అప్ప‌టికి నా స్పంద‌న అది. ఆ త‌ర‌వాత నేను ట్విట్ట‌ర్‌లో నా అభిప్రాయాన్ని చెప్పాను. నిజానికి ఆ జ‌ర్న‌లిస్టు కూడా కావాల‌ని ఆ ప్ర‌శ్న అడిగి ఉండ‌రు. అక్క‌డంతా స‌ర‌దా వాతావ‌ర‌ణం సాగుతుంది. కాబ‌ట్టి.. అలాంటి ప్ర‌శ్న అడిగి ఉంటారు. త‌ప్పులు అంద‌రూ చేస్తారు. నేనూ చేస్తా. అలాగ‌ని ఈ వివాదాన్ని ప‌ట్టుకునే మాట్లాడుతూ కూర్చోకూడ‌దు. డీజే టిల్లు అంటే ఇంకా చాలా ఉన్నాయి. మా క‌థ గురించి, టిల్లు గురించి, పాట‌ల గురించి మాట్లాడుకోవాలి. ఇలాంటి విష‌యాల గురించి కాదు“ అని చెప్పుకొచ్చాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close