సవ్యసాచి సమస్య ఏమిటి?

డైరక్టర్ చందు మొండేటికి హారిక హాసిని, ఇంకా సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేతలకు మధ్య ఏమిటి సమస్య? ప్రేమమ్ సినిమాను అదే బ్యానర్ లో చేసారు చందు మొండేటి. కానీ మళ్లీ ఆ బ్యానర్ లో చాన్స్ రాలేదు. అదే బ్యానర్ లో సినిమా చేసిన డైరక్టర్ మారుతి మాత్రం మళ్లీ సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ అయితే అదే బ్యానర్ లో ఫిక్స్ అయిపోయారు. మరి చందుతో ఏం సమస్య?

ప్రేమమ్ టైమ్ లోనే ఏదో జరిగిందని గుసగుసలు వున్నాయి. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేతలు ఏదో విధంగా చందును సాధించాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే సవ్యసాచి సినిమాను ఓవర్ కమ్ చేసి, ఎలాగైనా తమ సినిమానే ముందుకు తీసుకురావాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం చైతన్య దగ్గర తమకు వున్న సాన్నిహిత్యాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేతలు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

హీరో నాగ్ చైతన్య తలుచుకుంటే, సమస్య ఇట్లే పరిష్కారం అవుతుంది. రమ్యకృష్ణ బిజీ స్టార్ కాదు. పది రోజులు ఆమె డేట్ లు వాయిదా వేయించడం సమస్య కాదు. కానీ అలా చేయడం లేదు. ఆమె డేట్ లు సాకుగా చూపించి, చందు మొండేటి సవ్యసాచికి డేట్ లు అందకుండా చేస్తున్నారు. దీనికి నాగ్ చైతన్య యధాశక్తి కోపరేట్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సవ్యసాచి సినిమా మీద చైతన్యకు అనుమానం తలెత్తిందా అని అనుమానించాల్సి వస్తోంది.

ఇంకోపక్క చందు మొండేటికి ఐడ్రీమ్ వాసుదేవరెడ్డికి మధ్య సంబంధాలు చెడిపోయిన సంగతి తెలిసిందే. అదే వాసుదేవరెడ్డి తో శైలజరెడ్డి దర్శకుడు మారుతికి మాంచి సంబంధాలు వున్నాయి. అదే వాసుదేవరెడ్డికి డైరక్టర్ మారుతి పట్టుపట్టి శైలజరెడ్డి ఓవర్ సీస్ హక్కులు ఇప్పించారు.

సో, అందరు చందు మొండేటి వ్యతిరేకులు ఓ దగ్గర చేరినట్లు అయింది. దీనికి తోడు మైత్రీ మూవీస్ జనాలు సవ్యసాచి మీద గట్టిగా పట్టుపట్టడం లేదు. వాళ్లు అనేక ప్రాజెక్టులు ఒకేసారి పెట్టుకుని, వాటితో బిజీగా వున్నారు. ముఫై కోట్ల లాభం రంగస్థలంతో కళ్ల చూసి, వందల కోట్ల ప్రాజెక్టులు పెట్టుకున్న వాళ్లకు సవ్యసాచి లాంటి పాతిక కోట్ల సినిమా పెద్దగా సమస్య గా కనిపించడం లేనట్లు తెలుస్తోంది.

ఇదంతా చందు మొండేటి వ్యవహారంగా మారిపోయింది. అటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు, ఇటు చందు మొండేటి లాంటి ఏ బ్యాకింగ్ లేని డైరక్టర్. మధ్యలో చైతన్య. ఇదీ పరిస్థితి. అందుకే ఇప్పటికిప్పుడు ఏదైనా మార్పు జరిగితే తప్ప, ఆగస్టులో సవ్యసాచి రావడం అసాధ్యం. ఎందుకంటే ఈనెల 20వరకు చైతూ డేట్ లు ఇవ్వడు. నెలాఖరుకు కానీ ఫస్ట్ కాపీ రెడీ కాదు. అక్కడి నుంచి కీరవాణి ఆర్ ఆర్ కు కనీసం నెల రోజులు. ఇలా సవ్యసాచికి అనేక అడ్డంకులు తప్పవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close