అల్లుడ్ని హీరో చేసేస్తున్నాడు

మెగా ఇంట్లోంచి మ‌రో హీరో రాబోతున్నాడా??? రామ్‌చ‌ర‌ణ్‌, బ‌న్నీ, వ‌రుణ్‌, సాయిధ‌ర‌మ్‌ల‌కు ధీటుగా మరో హీరో రంగంలోకి దిగుతున్నాడా?? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ఆ హీరో ఎవ‌రో కాదు.. చిరంజీవి అల్లుడు క‌ల్యాణ్‌! ఇటీవ‌ల చిరు త‌న రెండో కుమార్తె శ్రీ‌జ‌కు రెండో వివాహం చేసిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌కు చెందిన బిజినెస్ మేన్ క‌ల్యాణ్‌ని అల్లుడిగా తెచ్చుకొన్నాడు చిరు. పెళ్లి సైలెంట్‌గా చేసేసినా, రిసెప్ష‌న్ మాత్రం గ్రాండ్‌గా చేశారు. ఆ వీడియోల్ని ఆన్ లైన్‌లోనూ వ‌దిలారు. చిరు అల్లుడ్ని చూసిన చాలామంది `హీరోలా ఉన్నాడు… సినిమాల్లోకి తీసుకొస్తారా` అంటూ చిరుని చాలామంది అడిగారు, నిజానికి ఆ ఉద్దేశం చిరంజీవికీ ఉంద‌ట‌. అల్లుడ్ని కూడా రంగంలోకి దించాల‌ని ఆయ‌న ఎప్పుడో ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు అందుకు త‌గిన స‌న్నాహాలు చేసుకొంటున్నార‌ట‌.

చిరంజీవి ప్ర‌స్తుతం త‌న 150 సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ హ‌డావుడి కాస్త త‌గ్గాక‌.. అల్లుడ్ని హీరో చేసే విష‌యంలో ఇంకాస్త లోతుగా ఆలోచిస్తార‌ట‌. మ‌రోవైపు క‌ల్యాణ్‌కీ హీరో అయిపోవాల‌న్న ఉత్సాహం మ‌రింత ఎక్కువ‌గా ఉంద‌ని, క‌ల్యాణ్‌ని హీరోగా మార్చేందుకు చ‌ర‌ణ్ కూడా.. త‌గిన ప్లానులు వేస్తున్నాడ‌ని, కొణెద‌ల కంపెనీలోనే ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. మ‌రి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? క‌ల్యాణ్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు? ఈ విష‌యాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close