అంబానీ రాక వెనుక “గాలి స్టీల్ ఫ్యాక్టరీ” డీల్..!?

ఒక్క రాజ్యసభ సీటు కోసం దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ అమరావతి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలుస్తారా..? ఇదీ.. రెండు రోజులుగా.. అటు సోషల్ మీడియాలోనూ..ఇటు రాజకీయవర్గాల్లోనూ జరుగుతున్న చర్చ. అసలు చర్చల వివరాలేంటో బయట పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే.. ఈ డిమాండ్లు ఇలా ఉండగానే…కడప జిల్లాలో రిలయన్స్‌కు చెందిన ఉన్నతాధికారుల బృందం ఒకటి పర్యటించింది. గతంలో గాలి జనార్ధన్ రెడ్డి కట్టాలని..కట్టలేకపోయిన బ్రహ్మణి స్టీల్స్ ఫ్యాక్టరీ స్థలాలను పరిశీలించింది. ఈ భూములను గాలి జనార్దన్ రెడ్డికి చెందిన మునుషులు దగ్గరుండి చూపించారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉండటం…కొన్ని వేల ఎకరాల భూమి ఉందని చూపించారు. అదే సమయంలో.. తాము ఉక్కు పరిశ్రమ కోసం.. నిర్మించిన గోడలు.. ఇతర నిర్మాణాలను చూపించారు. తెప్పించిన కొంత సామాగ్రి గురించి వివరించినట్లుగా తెలుస్తోంది.

బ్రహ్మణి స్టీల్స్ భూములను పరిశీలిస్తున్న బడా కంపెనీల ప్రతినిధులు..!

ఇప్పుడు రిలయన్స్ ప్రతినిధులు పరిశీలించారు కానీ.. గత కొద్ది రోజలుగా.. ఐదారు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు.. కడపకు వచ్చి బ్రహ్మణి స్టీల్స్‌కు చెందిన భూములను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కొంత మంది అధికారులు కూడా.. ఆయా పారిశ్రామిక సంస్థల ప్రతినిధులకు .. భూమి గురించి.. వివరిస్తున్నారు. ఇలా వస్తున్న వారిలో అత్యధికులు గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్తల కంపెనీలకు చెందినవారే. బ్రహ్మణి సంస్థ ప్రతినిధులు కూడా.. ఆ భూముల విలువని.. తాము చేయించిన పనుల విలువను..మొత్తంగా.. ఆ ప్రతినిధులకు వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

భూములను గతంలోనే వెనక్కి తీసుకున్న ప్రభుత్వం..!

వైఎస్ హయాంలో 2007లో బ్రహ్మణి స్టీల్స్‌కు 10,760.66 ఎకరాలను ఎకరా రూ.18 వేల చొప్పున కేటాయించారు. జమ్మలమడుగు మండలం అంబవరంవద్ద వాణిజ్య విమానాశ్రయం కోసం మరో 3115 ఎకరాలు కేటాయించారు. ఈ భూమి ధరను ఎకరా రూ.25వేలుగా నిర్ణయించింది. 2009 నాటికి 20 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో తొలిదశ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. అయితే గోడలు తప్ప ఏమీ నిర్మించలేదు. కానీ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించిన 10760 ఎకరాల భూములను యాక్సిస్ బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.350కోట్ల రుణం పొందింది. ప్లాంటుపై రూ.1350 కోట్లు ఖర్చు చేశామని బ్రహ్మణి ఇండస్ట్రీస్ కోర్టుకెళ్లింది.అయితే.. అక్కడ కేవలం రూ.171 కోట్లు ఖర్చు చేసి ఉంటారని పరిశ్రమల అధికారులు తేల్చారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ కేటాయింపులను రద్దు చేసారు. ఈ భూముల కేటాయింపు వెనుక అనేక అక్రమాలు జరిగాయని..ఓబులాపురం గనులు దోచుకునేందుకే.. ఈ పరిశ్రమను తెరపైకి తెచ్చారన్న ఆరోపణలు వచ్చాయి.

మళ్లీ గాలికే కట్టబెట్టి.. ఆ తర్వాత బడా కంపెనీలకు అప్పగించబోతున్నారా..?

ప్రస్తుతం ఆ భూకేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసినా కోర్టుల్లో కేసులు ఉండటంతో.. అక్కడ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ప్రయత్నించలేదు. వివాదాస్పద భూముల్లో పెడితే పెట్టుబడిదారులు రారని ఆగిపోయాయి. కొద్దిరోజుల కిందట.. స్టీల్ ఫ్యాక్టరీకి జగన్ శంకుస్థాపన చేశారు. అప్పుడు కూడా వేరే చోట చేశారు. ఇప్పుడు.. రద్దు చేసిన ఆభూములను..మళ్లీ గాలి జనార్ధన్ రెడ్డికి అప్పగించి.. ఆయన ద్వారా ఇతర బడా కంపెనీల చేతులు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా.. ప్రస్తుత పరిణాలు జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close