ఫ్లాష్ బ్యాక్‌: చ‌ర‌ణ్ – స‌మంత‌ ‘లిప్ లాక్‌’ వెనుక క‌థ‌

రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో `రంగ‌స్థ‌లం` ఓ మైలు రాయి. సుకుమార్ ని మ‌రో మెట్టు ఎక్కించిన సినిమా అది. క‌థ, క‌థ‌నం, ట్విస్టు, పాట‌లు, క్యారెక్టరైజేష‌న్లు.. ఇలా అన్ని విష‌యాల్లోనూ రంగ‌స్థ‌లం మెప్పించింది. అందుకే అంత పెద్ద విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమాని చ‌ర‌ణ్ ఎప్ప‌టికీ మ‌ర్చిపోడు. ఈ సినిమాలో చ‌ర‌ణ్ – స‌మంత‌ల కెమిస్ట్రీ అదిరిపోయింది. దానికి తోడు ఓ లిప్ లాక్‌కూడా. అయితే ఈ లిప్ లాక్ వెనుక చాలా పెద్ద క‌థ న‌డిచిందట‌.

సుకుమార్ చ‌ర‌ణ్‌కి స్క్రిప్టు చెప్పిన‌ప్పుడే ఈ లిప్ లాక్ సీన్ ఉంది. ఈ సీన్ గురించి చ‌ర‌ణ్ – సుకుమార్ మ‌ధ్య పెద్ద చ‌ర్చ న‌డిచింది. అప్ప‌టికి చ‌ర‌ణ్ కి పెళ్ల‌యిపోయింది. అందుకే ‘లిప్ లాక్ సీన్లు వ‌ద్దు.. ఉపాస‌న‌కు ఇలాంటివి ఇష్టం ఉండ‌దు’ అని ఖ‌రాఖండీగా చెప్పేశాడ‌ట‌. దానికి సుకుమార్ కూడా ‘స‌రే’ అన్నాడట‌. కానీ… ఈ సీన్ ఎంత అవ‌స‌ర‌మో.. సుక్కుకి తెలుసు. క‌చ్చితంగా ఈసీన్ ఉండాల్సిందే అనుకున్నాడు. మెల్ల‌మెల్ల‌గా చ‌ర‌ణ్ ని ఒప్పిద్దాం అని ఫిక్స‌య్యాడు. ఈ సీన్ గురించి ఎప్పుడు చ‌ర్చ వ‌చ్చినా చ‌ర‌ణ్ మాత్రం మొహ‌మాటం లేకుండా `ఈ సీన్ వ‌ద్దు అన్నాను క‌దా` అని చెప్పేసేవాడ‌ట‌.

కానీ ఈ సీన్ చిత్రీక‌రించే రోజువ‌చ్చేసింది. ‘చ‌ర‌ణ్ కి లిప్ లాక్ పెట్టు..’ అని స‌మంత‌కి చెప్పి, చ‌ర‌ణ్ కి మాత్రం ‘పెదాలు ద‌గ్గ‌ర‌గా వ‌స్తాయంతే.. దాన్ని మ‌నం గ్రాఫిక్స్ లో చీట్ చేయొచ్చు’ అని చెప్పి.. షూట్ కి రెడీ చేశాడు. సుకుమార్ యాక్ష‌న్ చెప్ప‌గానే.. స‌మంత నేరుగా లిప్ లాక్ ఇచ్చేసింద‌ట‌. అది నిజంగా… చ‌ర‌ణ్ ఊహించని ట్విస్టు. దాంతో చ‌ర‌ణ్ సుకుమార్ పై అలిగాడ‌ని, కానీ.. ఈ సీన్ ఎంత ముఖ్య‌మో సుకుమార్ ఆ త‌ర‌వాత చ‌ర‌ణ్ కి అర్థ‌మ‌య్యేలా చెప్పి క‌న్వెన్స్ చేశాడ‌ట‌. మొత్తానికి లిప్ లాక్ సీన్‌.. అలా త‌యారైపోయింది. ఈ సినిమాలో చ‌ర‌ణ్ – స‌మంత పాత్ర‌ల మ‌ధ్య ఉన్న గాఢ‌త‌ని, ప్రేమ‌నీ అర్థం చేసుకోవ‌డానికి ఆ సీన్ ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. ఓ స‌న్నివేశం తాము అనుకున్న‌ట్టుగా రావ‌డానికి ద‌ర్శ‌కులు ఏమైనా చేస్తారు. దానికి రంగ‌స్థ‌లం ఓ ఉదాహ‌ర‌ణ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close