‘సుందరం మాస్టార్’ రివ్యూ: సందేశాల సోషల్ పాఠం

Sundaram Master Movie Telugu Review

తెలుగు360 రేటింగ్‌: 2.5/5

-అన్వ‌ర్‌

మనిషి ఆరోగ్యంగా వుండాలంటే బరువు తగ్గాలి. ఈ బరువు రెండు రకాలు. శారీరక బరువు. మానసిక బరువు. మనిషి శారీరక బరువు మీద పెట్టిన ద్రుష్టి, మానసిక బరువు మీద పెడుతున్నాడా? ‘ఆశ’ కారణంగా మనిషి మీద ఎలాంటి ఒత్తిడి పెరుగుతుంది? ఇలాంటి జీవిత పాఠాల్ని ‘సుదంరం మాస్టర్’ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు కళ్యాణ్ సంతోష్. మరా పాఠాలు ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉన్నాయా? లేదా ఆటో వెనుక సూక్తుల్లా మిగిలాయా?

‘సుందరం( హర్ష చేముడు) మాస్టర్ చుట్టూ నడిచే కథ ఇది. సాంఘిక శాస్త్రం బోధిస్తున్న ఆయన.. పాడేరుకు చాలా దూరంగా ఉంటూ ప్రపంచంతో కమ్యునికేషన్ తెంచుకున్న మిర్యాలమెట్ట అనే గూడెంకు ఇంగ్లిష్‌ టీచర్‌గా వెళ్తాడు. ఆ పల్లెలో ప్రజలంతా ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి విద్యార్థులుగా వస్తారు. మరి వారికి సుందరం ఇంగ్లిష్‌ ఎలా బోధించాడు? అసలు మిర్యాలమెట్ట కథ ఏమిటి ? అక్కడి ప్రజలు ప్రపంచానికి దూరంగా ఎందుకు బ్రతుకుతున్నారు? ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలిగే వారికి ఇంగ్లీష్ నేర్చుకునే అవసరం ఎందుకు వచ్చింది ? సోషల్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ గా ఎందుకువచ్చాడు ? ఆ వూర్లో వున్న చాలా విలువైన వస్తువు ఏమిటి? ఇదంతా మిగతా కథ.

‘మనిషి నుంచి కోతిగా మారిపోతున్న ఓ జాతి నుంచి పుట్టిన కథ’ అంటూ ఓపెనింగ్ టైటిల్ వేసి ఇదొక జీవిత పాఠమని ప్రేక్షులని ముందే ప్రిపేర్ చేశాడు దర్శకుడు. మిర్యాలమెట్ట గూడెం చుట్టూ అల్లుకున్న కథనం ఆసక్తి కలిగిస్తుంది. సోషల్ టీచర్ గా సుందరం పాత్రని పరిచయం చేసిన తీరు, అతని అత్యాశ నైజం, లోకల్ ఎమ్మెల్యే డీఈవో ప్రమోషన్ ఆశ చూపి తనని మిర్యాలమెట్టకు పంపించడం, ఆ గూడెంలో ఎదో విలువైన వస్తువు కోసం సుందరం వెతుకులాట, సోషల్ టీచర్ ఇంగ్లీష్ పాఠాలతో పడిన తిప్పలు, భాష మాట్లాడగలిగి, రాయడం రాని అక్కడి ప్రజలు తోచినట్లు స్పెల్లింగ్ చెప్పుకునే వైనం, లోకల్ ఎమ్మెల్యేకి సుందరం రాసే ఉత్తరాలు.. ఇవన్నీ పగలబడి నవ్వేలా వుండవు కానీ ఓకే అనిపిస్తాయి.

నిజానికి ఇది రెగ్యులర్ కథ కాదు. ప్రక్రుతితో మమేకమై బ్రతుకున్న మనుషులకు, ఆశలలో కొట్టిమిట్టాడుతున్న మనషుల జీవితాలకు మధ్య తేడాని చూపించాలనేది దర్శకుడి ప్రయత్నం. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు ప్రేక్షకులకు సందేశంలా కాకుండా వినోదాత్మకంగా చెప్పడం ఒక నేర్పు. ఇందులో ఆ నేర్పు అంతగా కుదరలేదు. తొలిసగం ఎదోకొత్తగా ప్రయత్నిస్తున్నారనిపిస్తుంది కానీ.. సెకండ్ హాఫ్ అంతా ఏదో తత్వాన్ని బలవంతంగా రుద్దుతున్నారనే భావన చాలా చోట్లకలుగుతుంది. కథ, కాన్సెప్ట్ పరంగా కాస్త భిన్నంగానే అలోచించిన దర్శకుడు.. ఆ కథని సినిమాలా కాకుండా ఒక సోషల్ పాఠంలా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఒకే కథలో చాలా విషయాలు చెప్పేయాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇందులో అదే జరిగింది. కమ్యునికేషన్, అణిచివేత, ఫ్రీడం, డబ్బు, కల్చర్, హ్యూమన్ ఎమోషన్స్.. ఇలా చాలా కోణాల్లో ఈ కథని నడిపేయడంతో ఒక లక్ష్యం అంటూ లేకుండాపోయింది.

కథ చివరికి వచ్చేసరికి సుందరం మాస్టర్ ఓ పాఠం నేర్చుకున్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలగాలి. కానీ ఇందులో ఆ పాత్ర ప్రయాణం అలా వుండదు. నిజానికి దర్శకుడు కూడా ఆ పాత్రని అలా ప్రిపేర్ చేయలేకపోయారు. సుందరంకు జ్ఞానోదయం కావడమే ఈ కథకు సంపూర్ణ ముగింపు అన్నప్పుడు ఆడిటోరియంను అలా ప్రిపేర్ చేయాల్సింది. కానీ అలా జరగలేదు. ఇది కాకుండా ఈ కథలో ఇంకేదో వుందేమో అనే ఫీలింగ్ చివరివరకూ వుంటుంది. యువరాజ్ సింగ్ ఆరు సిక్స్ లు కొట్టే వీడియోని క్లైమాక్స్ కోసం వాడారు. ఇంగ్లాండ్ టీంని బ్రిటిషర్స్ అనుకోవడం, యువరాజ్ సింగ్ ని భగత్ సింగ్ గా ఊహించుకోవడం లాజిక్ కి దూరంగా వున్నా.. పాపం మిర్యాల మెట్ట అమాయకత్వంలో అలా అనుకోవాలంతే.

వైవా హర్ష ఇమేజ్ కి సరిపడే కథ ఇది. సుందరం మాస్టర్ పాత్ర తనకి బాగానే నప్పింది. గవర్నమెంట్ స్కూల్ టీచర్ బాడీ లాంగ్వేజ్ ని సరిగ్గా పట్టాడు. ఫస్ట్ హాఫ్ లో నవ్వులు పంచే ఆకాశం దక్కింది. పెళ్లి చూపులు సీన్ నవ్విస్తుంది. వైజాగ్ యాసని తను పలుకుతున్న విధానం ప్రామాణికంగా వుంటుంది. దివ్య శ్రీపాద సహజంగా కనిపించింది కానీ ఆమె పాత్రతో ఈ కథకి చేకూరిన ప్రయోజనం ఏమీ లేదు. ఓజా పాత్రలో చేసిన చైత‌న్య నటన ఆకట్టుకుంటుంది. హ‌ర్షవ‌ర్ధన్‌, భ‌ద్రం పరిమిత పాత్రల్లో కనిపిస్తారు. బ్రహ్మానందం ఇమేజ్ ని వాడుకున్న విధానం బావుంది. మిగతా నటులంతా పరిదిమేర చేశారు.

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. పూర్తిగా అవుట్ డోర్ లో తీశారు. డూడెం ను సహజంగా తీర్చిదిద్దారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. విజువల్స్ ప్లజెంట్ గా వున్నాయి. మాటలు బావున్నాయి కానీ.. ఆ తెలుగుని పలుకుతున్న విధానం కిచిడిలా వుంటుంది. బహుసా కథ పరంగా అలా అనుకున్నారెమో కానీ గ్రాంధికం, వ్యావహారికం, జానపదం, మాండలికం, ప్రాకృతం, వికృతం, బైబిల్ తెలుగు.. ఒకటి కాదు.. ఒక వాక్యంలోనే చిత్ర విచిత్ర అనుకరణలు వినిపిస్తాయి. రొటీన్ కి భిన్నంగా ఎదో కొత్త కథ చెప్పాలనే దర్శకుడి ఆలోచన బావుంది కానీ ఆచరణలోనే లోపాలు వున్నాయి. ఏదైనా ఒక మంచి మాట చెబితే ఆటో వెనుక కొటేషన్లు చెప్పకండని హేళన చేసే సుందరం లాంటి మనిషికి ప్రక్రుతితో ఓ పాఠం చెప్పాలనేది దర్శకుడి ప్రయత్నం. ఈ ప్రయత్నం సినిమాలా వినోదాత్మకంగా కాకుండా సోషల్ పిరియడ్ పాఠంలానే సాగింది. ఈ పాఠాన్ని చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా అనేది ప్రశ్నార్థకం.

తెలుగు360 రేటింగ్‌: 2.5/5

-అన్వ‌ర్‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close