సందీప్ కిషన్ ముచ్చటగా మూడు..!

కుర్ర హీరోల్లో సందీప్ కిషన్ అంటే ఓ సరికొత్త క్రేజ్.. స్నేహగీతంలో సినిమా కోసం ప్రాణం పెట్టే పాత్రలో నటించిన ఈ యువ హీరో నిజంగానే సినిమా అంటే అదేలా ఫీల్ అవుతాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్నా లాస్ట్ ఇయర్ వచ్చిన టైగర్ కాస్త పర్వాలేదనిపించింది. అయితే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా వరుసెంట సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు సందీప్ కిషన్. ప్రస్తుతం ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమాలో నటిస్తున్న సందీప్ ఆ సినిమాతో పాటుగా మరో రెండు క్రేజీ సినిమాలు చేస్తున్నాడు.

‘ఒక్క అమ్మాయి తప్ప’ తర్వాత మలయాళం ‘నేరం’ సినిమా రీమేక్ కు సైన్ చేసిన సందీప్ ప్రస్తుతం మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడట. నారా రోహిత్ హీరోగా ‘ప్రతినిధి’ సినిమాకు రచయితగా చేసిన ఆనంద్ రవి చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట సందీప్ కిషన్. ఈ సినిమాను రాజ్ తరుణ్ సినిమా చూపిస్త మావ నిర్మాత వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఒక అమ్మాయి తప్ప సినిమాలో నిత్యా మీనన్ తో రొమాన్స్ చేస్తున్న సందీప్ కిషన్ ఇక మిగిలిన రెండు సినిమాల స్టార్ కాస్ట్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది. సో ముచ్చటగా మూడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు సందీప్ కిషన్. మంచి కథలతో ముందుకు దూసుకెళ్తున్న సందీప్ కిషన్ కు రాబోయే సినిమాలన్ని సూపర్ హిట్స్ కావాలని కోరుకుందాం..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close