ఇలాగైతే థియేట‌ర్లు మూసుకోవాల్సిందే: సురేష్ బాబు

ఏపీలో టికెట్ రేట్ల వ్య‌వ‌హారం విష‌యంలో డి.సురేష్ బాబు కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడున్న టికెట్ రేట్లు అమ‌లైతే, క‌రెంటు ఛార్జీలు కూడా రావ‌ని, ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే, థియేట‌ర్లు మూసుకోవాల్సివ‌స్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొద్దిసేప‌టి క్రితం హైద‌రాబాద్‌లోని పాత్రికేయుల‌తో ఆయ‌న మాట్లాడారు.

”మార్కెట్లో ఒకొక్క వ‌స్తువుకీ ఒక్కో రేటు ఉంటుంది. అన్ని వ‌స్తువుల్ని క‌లిపి ఒకే రేటుకి అమ్మాలంటే ఎలా? సినిమా కూడా అంతే. పెద్ద సినిమాల బ‌డ్జెట్ వేరు. చిన్న సినిమాల బ‌డ్జెట్ వేరు. రెండు సినిమాల‌కూ ఒకే రేటు నిర్ణ‌యించడం స‌మంజ‌సం కాదు. ఇలాగైతే పెద్ద సినిమాలు భారీగా న‌ష్ట‌పోతాయి. ఏమైనా అంటే బ్లాక్ టికెట్ వ్య‌వ‌స్థ అంటుంటారు. బ్లాక్ టికెట్ వ్య‌వ‌స్థ‌.. రెండు మూడు రోజులు ఉంటుందేమో..? ఆ త‌ర‌వాత‌.. టికెట్ మామూలు రేటుకే అమ్ముతారు. తిప్పి కొడితే.. వెయ్యి కోట్ల ప‌రిశ్ర‌మ కాదిది. దానిపై ఇన్ని ఆంక్ష‌లేంటో అర్థం కావ‌డం లేదు. టికెట్ రేటు ఇంత అని చెప్ప‌లం.. కానీ థియేట‌ర్లో ప్రేక్ష‌కుడ్ని బ‌ల‌వంతంగా కూర్చోబెట్ట‌లేం. టికెట్ కొనిపించ‌లేం. ఇష్ట‌మొచ్చిన‌వాళ్లు చూస్తారు, లేదంటే లేదు. అది ప్రేక్ష‌కుడి చేతుల్లో ఉంటుంది. మా సినిమా చూడ‌మ‌ని ఎవ‌రూ నిర్భందించ‌లేరు క‌దా. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు రెండూ చిత్ర‌సీమ‌ని చిన్న‌చూపు చూస్తున్నాయి. ఇలాగైతే.. మ‌నుగ‌డ సాధించ‌డం క‌ష్టం” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close