ఈ కాంబినేష‌న్ ఎలా సెట్ట‌య్యిద‌బ్బా..??

టాలీవుడ్‌లో కాస్త ఆస‌క్తి క‌లిగించేలా ఓ కాంబినేష‌న్ సెట్ట‌య్యింది. సుశాంత్ క‌థానాయ‌కుడిగా.. మ‌రో క‌థానాయ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఓ యంగ్ హీరోని, మ‌రో యంగ్ హీరో డైరెక్ట్ చేయ‌డం నిజంగా ఆస‌క్తి క‌లిగించే విష‌య‌మే. అందాల రాక్ష‌సి సినిమాతో రాహుల్ చేరువ అయ్యాడు. రాహుల్ న‌టించిన ఒక‌ట్రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్దంగా ఉన్నాయి. ఈలోగా.. డైరెక్ష‌న్ ఛాన్స్ అందుకొన్నాడు. ఓ క‌థ రాసి, సుశాంత్‌కి వినిపించ‌డం, త‌ను ఓకే అనేయ‌డం జ‌రిగిపోయాయి. అయితే… ర‌వీంద్ర‌న్ ఏరి కోరి మ‌రీ.. సుశాంత్‌ని ఎందుకు ఎంచుకొన్నాడ‌బ్బా?? అనే ఆస‌క్తి నెల‌కొంది.

రాహుల్ ద‌ర్శ‌క‌త్వం అనేస‌రికి ఏ యంగ్ హీరో అయినా చేయ‌డానికి రెడీ గా ఉంటాడు. ఎందుకంటే రాహుల్ ఎవ‌రితో చేస్తాన‌న్నా ఆ ప్రాజెక్టుకి ఎంతో కొంత క్రేజ్ వ‌స్తుంది. సుశాంత్‌కి విజ‌యాల్లేవు. క‌రెంట్ త‌ప్ప‌.. సుశాంత్ కెరీర్‌లో ఆడిన సినిమాలేవీ లేవు. సుశాంత్ అయితే మ‌రో ప్రొడ్యూస‌ర్‌ని వెదుక్కోవాల్సిన అవ‌స‌రం లేద‌ని రాహుల్ భావించాడేమో. మ‌రోవైపు.. క‌థానాయ‌కుడిగా రాహుల్ ర‌వీంద్ర‌న్ ప‌రిస్థితి కూడా అంతంత‌మాత్ర‌మే. క‌థానాయ‌కుడిగా అవ‌కాశాల్లేక ద‌ర్శ‌కుడిగా నిరూపించుకొందామ‌ని ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నాడేమో. మొత్త‌మ్మీద కాంబో ప‌రంగా ఈ సినిమాపై ఓ లుక్కేయొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com