మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌నున్న వెట‌ర‌న్ డైరెక్ట‌ర్‌

చిన్న సినిమాల‌కు ఓ ఊపు తెచ్చిన వాళ్ల‌లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒక‌రు. క‌థాబ‌ల‌మున్న చిత్రానికి వినోదం జోడిస్తే ఎలా ఉంటుందో చూపించారాయ‌న‌. అలీని హీరోగా చేసి `య‌మ‌లీల‌` చేసింది ఆయ‌నే. మ‌హిళా పాత్ర‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చి.. కుటుంబ ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించారు. ఆయ‌న మెగాఫోన్ ప‌ట్టి చాలాకాలం అయ్యింది. `య‌మ‌లీల 2` తీసి – ఆయ‌న రిలాక్స్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌డానికి రెడీ అయ్యారు. అల్ల‌రి న‌రేష్ క‌థానాయ‌కుడిగా ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. శోభారాణి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ సినిమాలో మ‌రో క‌థానాయ‌కుడూ ఉంటాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. న‌రేష్ కెరీర్ చాలా దారుణంగా ఉంది. ఎస్వీ అయితే ఫామ్ కోల్పోయి చాలాకాలం అయ్యింది. కాక‌పోతే.. స‌రైన క‌థ ప‌ట్టుకుంటే క‌చ్చితంగా వీరిద్ద‌రూ ప్రేక్ష‌కుల్ని మైమ‌ర‌పించ‌గ‌ల‌రు. అప్ప‌ట్లో ఎస్వీ కృష్ణారెడ్డి – ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ పోటాపోటీగా సినిమాలు తీసేవారు. న‌రేష్ హీరో అయ్యాక‌.. ఎస్వీ జోరు త‌గ్గింది. మ‌రి… ఈవీవీ త‌న‌యుడికి ఎస్వీ కృష్ణారెడ్డి ఎలాంటి బ్రేక్ ఇస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సజ్జల భార్గవ, వైసీపీ సోషల్ మీడియా టీంపై సీఐడీ కేసులు !

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారంటే ఏంటో వైసీపీ సోషల్ మీడియా, వాటి ఇంచార్జ్ సజ్జల భార్గవను చూస్తే అర్థమైపోతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీపై కేసులు...

ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట దక్కేనా..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించడంతో...

ఓటేస్తున్నారా ? : కోర్టు ధిక్కరణల పాలన గుర్తుకు తెచ్చుకోండి!

రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఆ ప్రభుత్వం ఎందుకు ?. గతంలో ఒక్క కేసులో కోర్టు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం రాజీనామా...

ఓటర్ల ఖాతాల్లో డబ్బుల జమకు హైకోర్టు పర్మిషన్

అనేక రకాల కుట్రల విషయంలో వైసీపీ పెద్దల ప్లానింగ్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. చేయాలనుకున్నది చేసేయడానికి నాలుగు మార్గాలను ఎంచుకుంటారు. అందులో ఒక దాని ద్వారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close