టీ కాంగ్రెస్ ఎంపీల ఢిల్లీ ఎజెండా కేసీఆర్ ఆవినీతే..!

పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒకే ఒక్క అజెండా పెట్టుకున్నారు. అది ప్రజాసమస్యలు.. తెలంగాణ ప్రయోజనాలు.. విభజన హామీలులాంటివి కాదు. టీఆర్ఎస్ అవినీతిని… ఢిల్లీలో ప్రచారం చేయడం. టీఆర్ఎస్ అదే పనిగా అవినీతి చేసిందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిందో చెప్పాలని ప్రశ్నించడం. కాంగ్రెస్ తరపున గెలిచిన ముగ్గురు తెలంగాణ ఎంపీలు గాంధీభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ ముగ్గురులో ఒకరు ప్రస్తుతం పీసీసీ చీఫ్ ఉత్తమ్, మరో ఇద్దరు పీసీసీ చీఫ్ పదవి కోసం అదే పనిగా పోరాడుతున్న కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి. వీరు ముగ్గురూ సింగిల్ అజెండాగా కేసీఆర్ అవినీతిని పార్లమెంట్‌లో కూడా చర్చకు పెట్టాలని నిర్ణయించారు.

స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయని అవినీతి కేసీఆర్ చేశాని… కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల అవినీతి పై సీబీఐ విచారణ జరిపించాలని పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ అవినీతి అంతటికి ఆధారాలున్నాయని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా చెబుతున్నారని.. అయినా ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి పై చర్యలు ఎందుకు తీసుకోలేదో అడుగుతామని ఎంపీలు చెబుతున్నారు. పార్లమెంట్‌లో రాజకీయ ఆరోపణలపై ఎలా మాట్లాడుతారో కానీ.. ముగ్గురు ఎంపీలు మాత్రం తమ టార్గెట్ అదే అంటున్నారు.

ప్రజాసమస్యలపైనే.. అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఎంపీలే పట్టించుకోకపోతే.. తాముఎందుకు పట్టించుకోవాలన్నట్లుగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రయోజనాల కోసం కానీ.. రైతు చట్టాలు లాంటి వాటిపై కానీ కేంద్రంతో విబేధించే పరిస్థితుల్లో ఒక్క పార్టీ కూడా లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నా… వారిది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ అంశాలు హైలెట్ అవుతాయి. కానీ ఎలాగైనా సరే… టీఆర్ఎస్ అవినీతిని చర్చనీయాంశం చేయాలని పట్టుదలగా ఢిల్లీకి వెళ్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close