చంద్రబాబుపై తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు..!

స్పీకర్ అంటే.. రాజకీయాల్లో “అసెంబ్లీ స్పీకర్” అనే పదవికి ఫిక్సయిపోయింది. స్పీకర్ పదవికి ఓ గౌరవం ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ఉండాలి. పార్టీల జెండాలను కూడా.. మెడలో వేసుకోరు. ఇప్పటి వరకూ.. ఆ సంప్రదాయాలు కొనసాగాయి. కానీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్పీకర్.. తమ్మినేని స్పీకర్… అందరిలాంటి స్పీకర్ కాదు..అలాంటి.. ఇలాంటి “స్పీకర్” కూడా కానే కాదు.! అందుకే తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ” చంద్రబాబును ప్రజల మధ్య నిల్చోబెట్టి గుడ్డలూడదీస్తాం, ఓ పెద్ద పుస్తకం అంత అనుభవం ఎందుకు?..మడిచి ఎక్కడో పెట్టుకోమనండి..” ఇలాంటి సంప్రదాయమైన భాష ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం గారిదే.

ఆయనను పూర్వాశ్రమంలో చంద్రబాబు ప్రోత్సహించి ఉండవచ్చు గాక.. ఇప్పుడు.. వైసీపీలో ఉన్నారు. స్పీకర్ గా ఉన్నారు. ప్రసంగాల విషయంలో స్పీకర్‌గా ఆయనకు మంచి పేరుంది. అందుకే… తన స్పీకింగ్ టాలెంట్‌గా… తరచూ చూపిస్తున్నారు. అగ్రిగోల్డ్ ఖాతాదారులకు రూ. పదివేల చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో… చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. హాయ్‌ల్యాండ్‌ భూముల్ని కొట్టేసేందుకు.. చంద్రబాబు, లోకేష్‌ ప్లాన్‌ వేశారని ఆరోపించారు. అగ్రిగోల్డ్‌తో సంబంధం లేదని చంద్రబాబు ప్రకటించగలరా అని సవాల్ చేశారు. స్పీకర్ హోదాలో.. తాను ఇలా స్పీచ్ ఇస్తే… విమర్శలు వస్తాయని ఆయనకు తెలిసినట్లుగా ఉంది.. దానికి కూడా.. తన “స్పీక్స్‌”లోనే క్లారిటీ ఇచ్చారు.

కళ్ల ముందు అన్యాయం జరిగితే స్పీకర్ స్పందించకూడదా అని సమర్థించుకున్నారు. నేను ముందు ఎమ్మెల్యేని, తర్వాతే స్పీకర్‌నని చెప్పుకున్నారు. స్పీకర్ వ్యాఖ్యలపై.. టీడీపీ అదే తరహాలో కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య విలువలను పతనం చేయడంలో.. వైసీపీలో అందరూ తలా ఓ చేయి వేస్తున్నారని మండిపడింది. తమ్మినేనికి అంతగా.. రాజకీయం చేయాలని ఉంటే.. స్పీకర్ పదవికి రాజీనామా చేసి.. వైసీపీ అధికారప్రతినిధిగా చేరాలని సలహా ఇచ్చింది. మొత్తానికి ఏపీ స్పీకర్.. కొత్త సంప్రదాయాలను నెలకొల్పుతున్నట్లుగానే ఉందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close