తానా ఆధ్యాత్మికం

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో నిత్యం ఎన్నో కార్యక్రమాలు స్వామివారికి జరుగుతుంటాయి. ఆ స్వామివారికి జరిగే ఉత్సవాల్లో ప్రముఖమైనది శ్రీనివాసుని కళ్యాణమే. ప్రతినిత్యం జరిగే ఈ కళ్యాణమహోత్సవంలో పాల్గొనేందుకు ఎంతోమంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు తరలివస్తుంటారు. అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి కళ్యాణసేవలో (Srinivasa Kalyana Utsavam) స్వయంగా పాల్గొని తరించాలని ఎంతోమంది భక్తులు కోరుకుంటారు.

అలాంటి భాగ్యాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తన 22వ మహాసభల ద్వారా కల్పిస్తోంది. వాషింగ్టన్‌ డీసీలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగే తానా మహాసభల్లో శ్రీనివాస కళ్యాణం (Sri Srinivasa Kalyanam) వేడుకను కూడా తిరుమలలో జరిగే విధంగా ఆగమపద్ధతుల్లో సంప్రదాయంగా నిర్వహించేందుకు తానా కాన్ఫరెన్స్‌ కార్యవర్గం ఏర్పాట్లు చేసినట్లు అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు.

మహాసభల్లో జూలై 6వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకస్వాములతో ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. టీటీడి కళ్యాణం ప్రాజెక్టు స్పెషల్‌ డ్యూటీ ఆఫీసర్‌ ఎల్‌. సుబ్బారాయుడుతోపాటు అర్చకులు, (Vedic Pundits in USA) వేద పండితులు శ్రీధర్‌ పరాంకుశం, వెంకటేశన్‌, ప్రహ్లాదాచార్యులు, శరత్‌కుమార్‌ ఆచార్యులు, సుందర వరద శర్మ తదితరులు టీటీడి తరపున శ్రీనివాస కళ్యాణం చేయించేందుకు వస్తున్నారు.

తానా మహాసభల్లోనే కాకుండా మరో 3 చోట్ల కూడా శ్రీనివాస కళ్యాణంను నిర్వహిస్తోంది (Sri Venkateswara Swamy Kalyana Mahotsavam). జూలై 13న ఫిలడెల్ఫియాలో, జూలై 14న న్యూజెర్సిల, జూలై 20న డల్లాస్‌లోనూ శ్రీనివాస కళ్యాణంను నిర్వహిస్తోంది. ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో భక్తిగీతాలను పాడేందుకు గాయనీగాయకులు కూడా వస్తున్నారు. సునీత, స్మిత, రామాచారి, నిహాల్‌ ఇందులో భక్తిగీతాలను పాడనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని అధ్యక్షుడు సతీష్‌ వేమన, శ్రీనివాసకళ్యాణం కమిటీ చైర్‌ లక్ష్మీదేవినేని, ఆధ్యాత్మిక కమిటీ చైర్‌ సుబ్బు వారణాశి కోరుతున్నారు.

తానా మహాసభల వేదికపై అన్నమయ్య సప్తగిరి సంకీర్తన గళార్చన (Annamayya Sapthagiri Sankirthana Galarachana)పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. జూలై 6వ తేదీన మహాసభల వేదికపై జరిగే ఈ కార్యక్రమంలో గురు చైతన్య సోదరులతోపాటు 108 మంది కళాకారులు పాల్గొని అన్నమయ్య సంకీర్తనలను గానం చేయనున్నారు.

స్వామివారి కళ్యాణమహోత్సవానికి తరలిరండి – సతీష్‌ వేమన

తానా మహాసభల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈసారి ప్రాముఖ్యత ఇచ్చాము. ఇందులో భాగంగానే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వస్తున్న అర్చకస్వాముల చేతుల మీదుగా జరిగే ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో మీరంతా కుటుంబసమేతంగా పాల్గొని స్వామి దయకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. దీంతోపాటు భక్తి సంగీత కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తానా మహాసభల వేదికపై జరిగే అన్నమయ్య సప్తగిరి సంకీర్తన గళార్చనలో కూడా మీరు పాల్గొనాలని కోరుకుంటున్నాను.

ఇతర వివరాలకు తానా కాన్ఫరెన్స్‌ వెబ్‌సైట్‌ను www.TANA2019.org చూడండి.

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close