ప్ర‌ధాని నివాసం ముట్ట‌డికి టీడీపీ ఎంపీల ప్ర‌య‌త్నం..!

ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం తెలుగుదేశం ఎంపీలు ఆందోళ‌న సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆదివారం నాడు ఢిల్లీలోని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నివాసం ద‌గ్గ‌ర ఆందోళ‌న‌కు దిగారు. పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం, వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సంద‌ర్భంగా టీడీపీ ఎంపీల‌ను పోలీసులు ఈడ్చుకెళ్లారు. దీంతో ఎంపీ సుజ‌నా చౌద‌రి భుజానికి గాయ‌మైంది. ఏపీ స‌మ‌స్య‌ల విష‌య‌మై శాంతియుతంగా డిమాండ్ చేస్తుంటే అరెస్టులు చేస్తారా అంటూ సుజ‌నా మండిప‌డ్డారు. పార్ల‌మెంటులో ఎంత‌గా పోరాడినా త‌మ గోడు వినిపించుకోలేద‌నీ, త‌మ హ‌క్కుల కోసం పోరాటాలు చేస్తున్నామ‌ని టీడీపీ ఎంపీలు చెప్పారు. ఏపీకి హోదా సాధించే వ‌ర‌కూ పోరాటం కొన‌సాగిస్తామ‌న్నారు.

నిర‌స‌న చేస్తున్న టీడీపీ ఎంపీల‌ను పోలీసులు అరెస్టు చేసి, ఢిల్లీలోని తుగ్ల‌క్ రోడ్ కి త‌ర‌లించారు. ఈ విష‌యం తెలుసుకున్న ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఎంపీల‌కు బాస‌ట‌గా నిలిచారు. టీడీపీ ఎంపీల‌ను ప‌రామ‌ర్శించి సంఘీభావం తెలిపారు. టీడీపీ చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంద‌నీ, త‌మ రాష్ట్ర హక్కుల కోసం శాంతియుతంగా నిర‌స‌న తెలిపే హ‌క్కు వారికి ఉందంటూ కేజ్రీవాల్ సంఘీభావం ప్ర‌క‌టించారు. ఆంధ్రాకు ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల‌నీ, ఏపీకి ఇచ్చిన హామీల విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు.

అయితే, టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటంపై వైకాపా శ్రేణుల స్పంద‌న మ‌రోలా ఉంది. త‌మ‌లానే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఉంటే కేంద్రంపై మ‌రింత ఒత్తిడి పెరిగేద‌ని వైకాపా నేత‌లు అంటున్నారు. వైకాపా ఎంపీల రాజీనామాల అంశం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయం అవుతోంద‌నీ, టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయ‌డం లేద‌నే డిమాండ్ పెరుగుతోంద‌నీ, దాన్నుంచి త‌ప్పించుకోవ‌డం కోస‌మే ఇప్పుడు టీడీపీ ఎంపీలు ప్ర‌ధాని ఇంటిని ముట్ట‌డించే కార్య‌క్ర‌మాల్లాంటివి చేప‌డుతున్నారంటూ కొన్ని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కానీ, వైకాపా నేత‌ల అర్థం చేసుకోవాల్సిన విష‌యం ఏంటంటే… రాజీనామాతోనే వారి చివ‌రి అస్త్ర ప్ర‌యోగం జ‌రిగిపోయింది. దాని వ‌ల్ల కొత్త‌గా ఒరిగిందేం లేదు, జ‌రిగిందేం లేదు. రాజీనామాలు చేశారు, తద్వారా హోదా ఎలా సాధిస్తార‌న్న స్ప‌ష్ట‌త ప్ర‌జ‌ల‌కు వారు ఇవ్వ‌లేక‌పోతున్నారు. ఆ దిశ‌గా ప్ర‌జ‌లు ఆలోచించే లోపుగానే.. వారికి అలవాటైన రాజ‌కీయ దాడి మొద‌లుపెడుతున్నారని చెప్పుకోవచ్చు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close