ఫలితాలిస్తున్న తెలంగాణ డాక్టర్ల “వైరస్‌ వైద్యం”

కరోనాపై పోరాటంలో తెలంగాణ వైద్యులు మంచి పురోగతి సాధిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. చికిత్స పొందుతున్న 514 యాక్టివ్ కేసుల్లో 128 మందికి కరోనా నెగెటివ్ వచ్చింది. ఒకే సారి ఇంత పెద్ద మొత్తంలో నెగెటివ్ రావడంతో.. వైద్యులు చేస్తున్న చికిత్స.. ఫలితాలను ఇస్తున్నట్లుగానే వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి ప్రపంచవ్యాప్తంగా.. ఇప్పుడు.. కరోనా వైరస్‌కు ఎలాంటి చికిత్స చేయాలో ప్రోటోకాల్ లేదు. దేశానికి తగ్గట్లుగా.. వైద్యులు .. కొత్త కొత్త మందులతో ప్రయోగాలు చేస్తున్నారు. వీలైనంత వరకూ.. మలేరియా మందులతో తగ్గిపోతోందన్న ప్రచారం జరిగింది కానీ కొన్ని దేశాల్లో ఆ మందు సైడ్ ఎఫెక్టులకు కారణం అవుతోందని పరిశోధనల్లో తేలాయి. దాంతో వైద్యులు.. తమ మేథస్సుకు పని పెట్టి చికిత్సలు చేస్తున్నారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత.. వైరస్ పూర్తిగా తగ్గిపోయి.. డిశ్చార్జ్ అయిన వారు ఇప్పటికే 120 మంది ఉన్నారు. మరో 128 మందిని నేడు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. అంటే.. మొత్తంగా 248 మందికి కరోనా నయం చేసినట్లు అవుతుంది. నమోదైన కేసులు మొత్తంగా 650. ఇందులో 248 మందికి క్యూర్ అవుతోంది. కరోనాను గుర్తించిన తర్వాత.. ఆస్పత్రిలో చికిత్స ప్రారంభిచిన తర్వాత.. చనిపోయిన వారు తెలంగాణలో స్పల్వం. తెలంగాణలో కరోనా కారణంగా మొత్తం 18మంది చనిపోయారు. వీరు అందరూ.. తబ్లిగీ జామాతే సభ్యులే. ఎక్కువ మంది కరోనా లక్షణాలను గుర్తించలేకపోవడం… ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందడం.. ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కరోనా గుర్తించేలోపే ప్రమాదకరంగా మారడంతో ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతూ చనిపోయిన వారు చాలా తక్కువ. ప్రస్తుతం.. చికిత్స పొందుతున్న వారిలో.. అత్యంత సీరియస్‌గా ఉన్న వారు ఎవరూ లేరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ వైద్యులు…వ్యూహాత్మక చికిత్సా విధానాలను అవలంభిస్తున్నారు. కరోనా రోగులకు సంబంధించి వారి పాత ఆరోగ్య సమస్యలు… ఇతర వివరాలన్నింటినీ తెలుసుకుని.. పకడ్బందీగా ఇస్తున్న చికిత్స… వైరస్‌ను ఎదుర్కొనేలా… రోగి రోగనిరోధక శక్తిని పెంచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ ప్రణాళిక ప్రకారం.. ప్రత్యేకమైన వ్యూహంతో .. తెలంగాణ వైద్యలు కరోనాపై పోరాటం చేస్తున్నారు. తెలంగాణలో నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా.. రాను రాను తగ్గుతోంది. బుధవారం.. తెలంగాణలో ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close