కాంగ్రెస్ వ్యూహకర్తను అరెస్ట్ చేసే ప్లాన్‌లో తెలంగాణ పోలీసులు !

కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ , కోర్ టీం సభ్యుడు అయిన సునీల్ కనుగోలును అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కవితపై లిక్కర్ క్వీన్ అంటూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులను కాంగ్రెస్ సోషల్ మీడియా టీం పెట్టిందని ఆరోపిస్తూ పోలీసులు .. సునీల్ కనుగోలు టీం ఉన్న కార్యాలయంపై దాడి చేశారు. అందులో ఉన్న కంప్యూటర్లన్నీ ఎత్తుకెళ్లడంతో పాటు నలుగురు ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ భ గ్గు మంది పార్లమెంట్‌లోనూ తెలంగాణ పోలీసుల తీరును కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావించారు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

ఈ అంశంపై పోలీసులు వివరణ ఇచ్చారు. మహిళల్ని కించ పరిచేలా పోస్టింగులు పెట్టారని.. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు కానీ.. ఇలా మార్ఫింగ్‌లతో పోస్టింగ్‌లు పెట్టడం నేరమని చెప్పారు. ఫిర్యాదు అందిందని.. నోటీసులు కూడా ఇచ్చామని.. ఆ తర్వాతే అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. తాము అరెస్ట్ చేసిన ఉద్యోగులు.. సునీల్ కనుగోలు చెబితేనే మార్పింగ్‌లు చేశామని చెప్పారని.. ఆయనకూ నోటీసులు ఇస్తామని ప్రకటించారు.

ఈ అంశాన్ని కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. ఏ పోస్టులు పెట్టారని కేసులు పెట్టారో.. అవే తాను కూడా పెడుతున్నానని ఎంపీ మాణిగం ఠాగూర్ సవాల్ చేసి అవే పోస్ట్ చేశారు. దమ్ముంటే తననూ అరెస్ట్ చేయాలన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తోంది. సునీల్ కనుగోలు ఢిల్లీ స్థాయిలో … కాంగ్రెస్ కు స్ట్రాటజీలు రూపొందిస్తున్నారు. రాహుల్ పాదయాత్రలో కీలకంగా ఉంటున్నారు. అందుకే అరెస్ట్ చేయాలనుకుంటున్నారని రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగమంటున్నారు.

నిజానికి టీఆర్ఎస్ నేతలు.. బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు చేసే పోస్టింగ్‌లు.. మరీ అభ్యంతరకంగా ఉంటాయి. కవితను లిక్కర్ క్వీన్ అంటూ ఢిల్లీలో బీజేపీ నేతలు ఎన్ని సార్లు ట్రెండింగ్ చేశారో లెక్కలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పోస్టులు పెట్టగానే.. సునీల్ కనుగోలు ఆఫీస్‌ను సీజ్ చేసేసి.. కంప్యూటర్లు తీసుకెళ్లిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close