ఆర్నాబ్‌ను జర్నలిస్టుగా గుర్తించింది ఒక్క బీజేపీనే..!?

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్‌ ఆర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గర్నుంచి చోటా బీజేపీ నేత వరకూ స్పందించారు . అందరూ ఖండించారు. మహారాష్ట్రలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం ఉందని అందరూ మండిపడ్డారు. ఈ స్పందనలు చూసి..సోషల్ మీడియాలో  ఒకటే ట్రోలింగ్ నడుస్తోంది. ఆర్నాబ్ గోస్వామి జర్నలిస్టా లేకపోతే..  బీజేపీ నేతా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా జర్నలిస్టు అనే వారిపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడితే అటు మీడియా ప్రపంచం మొత్తం.. ఇటు రాజకీయ నేతలు అందరూ మద్దతుగా నిలుస్తారు. కానీ ఆర్నాబ్ విషయంలో  బీజేపీ నేతలు తప్ప ఏ ఒక్కరూ మద్దతుగా స్పందించలేదు. 

జర్నలిజంలో ఆర్నాబ్ స్టైల్ వేరు.  చాలా మంది మీడియాలో తాము సపోర్ట్ ఇవ్వాలనుకున్న పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తారు. కానీ ఇతర పార్టీల పట్ల అనుచితమైన వార్తా కథనాలు .. అభ్యంతరకమైన భాషను వినియోగించరు. కానీ ఆర్నాబ్ మాత్రం దానికి భిన్నం.  అచ్చం బీజేపీ సోషల్ మీడియా స్టైల్లో ఆయన టీవీ చానల్ స్టోరీస్ ప్రసారం చేస్తూంటారు. విపక్షాలన్నింటినీ పాకిస్థాన్ మద్దతు దారులుగా చెప్పడానికి ఆయన ఏ మాత్రం సంకోచించరు. దీంతో ఆయనకు మీడియాలో కూడా పెద్దగా మద్దతు లభించలేదు. 

ఎడిటర్స్ గిల్డ్ లాంటి సంస్థలు మొక్కుబడిగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశాయి. బీజేపీ మద్దతు ఉన్న కొంత మంది అరెస్టును ఖండించారు. కానీ ఇతర వర్గాల నుంచి సపోర్ట్ రాలేదు. జర్నలిస్టులు పూర్తిగా ఒక వర్గానికి .. ఒక పార్టీకి అంకితమైపోతే.. ఇతరులపై విషం చిమ్మితే అది జర్నలిజం అనిపించుకోదు. ఆ మీడియాకు విశ్వసనీయత ఉండదు. ప్రస్తుతం ఆర్నాబ్ ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close