కాంగ్రెస్ సీనియర్ల షోకు చెక్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్

కాంగ్రెస్ పార్టీలో నేతలు ఎలా ఉంటారంటే వారి బలానికి ప్రాతిపదిక … ప్రజల్లో వారికి ఉన్న పట్టు కాదు. సీనియర్లు అనే ట్యాగ్. తాము సీనియర్లమని.. తాము చెప్పినట్లుగా నడవాలని వారు అనుకుంటూ ఉంటారు. లేకపోతే రచ్చ చేస్తూంటారు. ఇప్పుడు అలాంటి వారందరికీ కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగానే షాకిచ్చింది. టిక్కెట్ల విషయంలో ఈ సారి సీనియర్ నేతలెవరూ మాట్లాడటం లేదు. దీనికి కారణం హైకమాండ్ ఇచ్చిన షాకేనని చెబుతున్నారు.

మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా అనేక మంది సీనియర్లు తమ కుటుంబానికి రెండు టిక్కెట్లు కావాలని.. తమ అనుచరులుక టిక్కెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అయితే చాన్స్ లేదని.. బీఫామ్‌ మీక్కావాలో, మీ కుటుంబ సభ్యులకు కావాలో తేల్చుకోవాలని హైకమాండ్‌ తేల్చి చెప్పేసింది. చేరికల విషయంలోనూ ఎవరైనా అడ్డుకుంటే ఊరుకునేదిలేదన్న సంకేతాలను ముందుగానే పంపింది. నల్లగొండ జిల్లాలో ఇక ఎవర్నీ చేర్చుకోమని సొంత ప్రకటనలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గట్టిషాక్ ఇచ్చింది. ఆయన వ్యతిరేకించినా వేముల వీరేశంను పార్టీలో చేర్చేసుకున్నారు. ఆయన కిక్కురుమనలేకుండా ఉన్నారు.

కొత్తగా చేరే వారిలో పొటెన్షియల్ లీడర్స్ ఉంటే వారి కోటాలో రెండు, మూడు టిక్కెట్లు కేటాయించడానికి రెడీనే. మైనంపల్లి మూడు సీట్ల బాధ్యత తీసుకున్నారు. గెలుస్తారని భావించిన వారందర్నీ చేర్చుకుటంున్నారు. బీఆర్‌ఎస్‌తో నేరుగా తలపడి గెలిచే అభ్యర్థులతోనే నాయకులే లక్ష్యంగా కాంగ్రెస్‌ ఎన్నికల్లో రణరంగంలోకి దిగుతుందని మొహంమీదనే చెప్పేస్తున్నారు. టికెట్టు ఇచ్చిన తర్వాత కూడా అవసరమైతే బిఫామ్‌ మారే అవకాశం ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నారు. టార్గెట్‌ మిస్సవ్వకుండా కారును ఢీ కొట్టాలని చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సూటిగా, స్పష్టంగా ఉండటంతో సీనియర్ల పేరుతో రాజకీయం చేసే వారికి నోరెత్తే అవకాశం లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close