గోపీచంద్ సినిమాకి థియేట‌ర్లు ఇచ్చారో.. అంతే!

అక్టోబ‌రు 2న ‘సైరా’ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. చిరంజీవి సినిమా, అందులోనూ పాన్ ఇండియా క్రేజ్ తో విడుద‌ల అవుతోంది. ఇలాంటప్పుడు మిగిలిన సినిమాలు సైడ్ ఇవ్వ‌డం మామూలే. ఓ వైపు చిరంజీవి పోస్ట‌ర్ ప‌డిన‌ప్పుడు – మ‌రో సినిమా విడుద‌ల‌కు రెడీ అవ్వ‌డం నిజంగా సాహ‌స‌మే. కానీ ‘చాణక్య‌’ మాత్రం అవేం ప‌ట్టించుకోవ‌డం లేదు. అక్టోబ‌రు5న విడుద‌ల అవ్వ‌డానికి స‌మాయాత్తం అవుతోంది. గోపీచంద్‌కి ఈమ‌ధ్య స‌రైన సినిమాల్లేవు. రిలీజ్ డేట్ విష‌యంలో త‌ప్పు చేస్తే.. అడ్డంగా దొరికిపోతాడు. కాక‌పోతే.. ఇది పండ‌గ సీజ‌న్‌. ‘సైరా’తో పాటు మ‌రే సినిమా వ‌చ్చినా, దానికి రావ‌ల్సిన ఆద‌ర‌ణ దానికి ఉంటుంద‌ని న‌మ్ముతూ ‘చాణ‌క్య‌’ని రెడీ చేస్తున్నారు. కానీ.. ఈ సినిమాకి త‌గిన సంఖ్య‌లో థియేట‌ర్లు దొరుకుతాయా, లేదా? అనేది అనుమానంగా మారింది.

బుధ‌వారం ‘సైరా’ విడుద‌ల అవుతోంది. అది ఆడ్ డేనే. గురు, శుక్ర వారాల‌కు సైరా హ‌వా కొద్దిగా త‌గ్గొచ్చు. ఎక్కువ థియేట‌ర్ల‌లో సినిమా విడుద‌ల చేస్తారు కాబ‌ట్టి, రెండో రోజుకే ఆ సంద‌డి త‌గ్గుతుంది. అందుకే చాణక్య సైలెంట్‌గా శ‌నివారం వ‌స్తున్నాడు. ఈ విష‌యంలో నిర్మాత‌ల లెక్క‌లు నిర్మాత‌ల‌వి. అయితే… థియేట‌ర్ య‌జ‌మానుల‌కు మాత్రం ఓ నిర్మాత ఫోన్ చేసి ‘చాణక్య‌కు థియేట‌ర్లు ఇవ్వొద్దు’ అని బెదిరిస్తున్నాడ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ‘సైరా’ బాహుబ‌లి రికార్డుల్ని బ‌ద్ద‌లు కొట్టాల‌న్న ధ్యేయంతో వ‌స్తోంద‌ని, పండ‌గ అయ్యేంత వ‌ర‌కూ అదే సినిమా ఆడాల‌ని.. అలా జ‌ర‌గాలంటే – ‘చాణ‌క్య‌’కు థియేట‌ర్లు ఇవ్వ‌కూడ‌ద‌ని.. గ‌ట్టిగా చెబుతున్నాడ‌ట‌. ఆ నిర్మాత మెగా కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు. ఆయ‌న చేతిలో కొన్ని థియేట‌ర్లు కూడా ఉన్నాయి. ప‌రిశ్ర‌మ‌లో కాస్త‌ప‌లుకుబ‌డి ఉన్న వ్య‌క్తి కాబ‌ట్టి ఆయ‌న మాట‌కు ఎవ‌రైనా విలువ ఇస్తారు. అందుకే… చాణ‌క్య‌కు థియేట‌ర్లు ఇచ్చిన‌వాళ్లు ఇప్పుడు కాస్త ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

పెద్ద సినిమాలు వ‌స్తున్నప్పుడు – అందులోనూ సైరా లాంటి ప్ర‌తిష్టాత్మ‌క సినిమాలు వ‌స్తున్న‌ప్పుడు మిగిలిన సినిమాలు కాస్త దారిస్తాయి. క‌నీసం వారం రోజుల గ్యాప్ ఉండేలా చూస్తాయి. సాహో విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. కానీ.. సైరాకు మాత్రం కొన్ని సినిమాలు భ‌య‌ప‌డ‌డం లేదు. అందులో చాణక్య ఒక‌టి. ‘చాణ‌క్య‌’ సైరాకి అడ్డు కాదు. కాక‌పోతే… పండ‌గ సీజ‌న్‌లో ‘సైరా’ ఒక్క‌టే ఉంటే అడ్వాంటేజ్ దొరుకుతుంది. సినిమా ఎలా ఉన్నా, జ‌నాలు చూస్తార‌న్న న‌మ్మ‌కం ఉంటుంది. కానీ ప‌రిస్థితులు త‌ల‌కిందులై… ‘సైరా’ ఉధృతి ఓ రేంజులో ఉంటే.. ‘చాణ‌క్య‌’ విడుద‌ల అవ్వ‌డానికి కాస్త ఆలోచించుకోవాల్సిందే. ఈలోపు ఇలాంటి బెదిరింపులు వాళ్ల‌కి కాస్త జంకేలా చేస్తుంటాయి. మ‌రి.. ‘సైరా’ని ఢీ కొట్టాల‌నుకున్న ‘చాణిక్యు’డి ప‌రిస్థితి ఏమ‌వుతుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close