రివ్యూ: టైగర్‌ నాగేశ్వరరావు


Tiger Nageswara Rao Movie Review

తెలుగు360 రేటింగ్ : 2.5/5

‘టైగర్‌ నాగేశ్వరరావు’ రవితేజకి రెండు రకాలుగా ప్రత్యేకం. ఆయన చేసిన మొదటి బయోపిక్ ఇది. అలాగే ఆయన మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే. తెలుగుతో పాటు నార్త్ లో కూడా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ని బాగానే ప్రమోట్ చేశారు. ట్రైలర్ లో పాన్ ఇండియా గ్రాండ్ నెస్ కనిపించింది. సాధారణంగా రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ తారల బయోపిక్స్‌ తెరపైకి వస్తాయి. కానీ ఈసారి ఓ దొంగ జీవితాధారంగా సినిమా రూపొందించడం విశేషం. మ‌రి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి వినోదాల్ని పంచింది ? టైగర్ పాత్రలో రవితేజ ఎంతలా అలరించారు?

అవి ఇందిరాగాంధీ ప్రధానిగా వున్న రోజులు. ప్రధాని కార్యాలయానికి స్టూవర్టుపురం నాగేశ్వరరావు అలియాస్ టైగర్ నాగేశ్వరరావు ( రవితేజ) నుంచి ఓ బెదిరింపు లేఖ వస్తుంది. దీంతో ప్రధాని రక్షణ సిబ్బంది రంగంలో దిగి ఆ లేఖ వెనుక వున్న ఉద్దేశం ఏమిటో కనుక్కుకోవడాని గతంలో టైగర్ జోన్ లో పని చేసిన పోలీస్ అధికారి (మురళీ శర్మ) ని ఢిల్లీ రప్పిస్తారు. మురళీశర్మ స్టూవర్టుపురం నాగేశ్వరరావు ఎలాంటి వాడో ఢిల్లీ అధికారులకు వివరిస్తాడు. అసలు నాగేశ్వరరావు ఎవరు ? అతని గతం ఏమిటి ? దొంగలా ఎందుకు మారాడు ? నాగేశ్వరరావు.. టైగర్ నాగేశ్వరరావు ఎలా అయ్యాడు? ప్రధానమంత్రికి బెదిరింపు లేఖ ఎందుకు రాశాడు ? ఇవన్నీ తెరపై చూడాలి.

స్టూవర్టుపురం నాగేశ్వరరావు గురించి కొంత సమాచారం పబ్లిక్ డొమైన్ లో వుంది. అతను రాబిన్ వుడ్ తరహా దొంగని, వీరోచితంగా దొంగతనాలు చేసేవాడని.. ఇలా చాలా కథలుగా చెబుతుంటారు. ఈ చిత్ర దర్శకుడు వంశీ దాదాపు రెండేళ్ళు నాగేశ్వరరావు కథపై పరిశోధన చేసి వివరాలు సేకరించి ఈ బయోపిక్ తీశానని చెప్పాడు. అయితే ఆయన కూడా వీటికి ఆధారాలు లేకపోవడంతో నిజమైన కట్టుకథలు ఆధారంగానే ఈ బయోపిక్ వుంటుంది చెప్పాడు. నాగేశ్వరరావు అనగానే ఇందిరాగాంధీ ఎపిసోడ్ గురించి చాలా మంది చెబుతారు. ఈ కథని ఆ ఎపిసోడ్ తోనే మొదలుపెట్టాడు దర్శకుడు. ప్రధానమంత్రి కార్యాలయానికి ఉత్తరం రావడం, తర్వాత భారీ ఎలివేషన్ తో నాగేశ్వరరావు పాత్ర పరిచయం, ఆ క్రమంలో వచ్చే గోదావరి బ్రిడ్జ్ రైలు దోపిడీ ఆసక్తికరంగా వుంటాయి. ఈ ఎపిసోడ్ తో టైగర్ పాత్ర, అతని కథపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆ ఆసక్తి ఎంతోసేపు కొనసాగదు. సారా పాత్రలో నూపూర్ సనన్ ఎంట్రీతో టైగర్ గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అవుతుంది. ఆ లవ్ ట్రాక్ అంతా రొటీన్ గా వుంటుంది. ఆ క్రమంలో వచ్చే పాట కూడా ఈ బయోపిక్ టోన్ కి మ్యాచ్ కాలేదు. ఆ పాత్ర ముగింపుతో మళ్ళీ టైగర్ గాడిలో పడుతుంది. ఈ క్రమంలో వచ్చే విరామ ఘట్టం ఆసక్తికరంగానే వుంటుంది.

ఫస్ట్ హాఫ్ పర్లేదు డీసెంట్ గానే వుందని ఫీలింగ్ కలిగించిన టైగర్.. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మాత్రం గ్రాఫ్ ఇంకాస్త డౌన్ అయిపోతుంది. నాగేశ్వరరావు పాత్రని ఒక్కసారిగా రాబిన్ వుడ్ తరహాలోకి మార్చేశారు. అయితే ఈ మార్పు చాలా హడావిడిగా వుండటంతో పాటు… సన్నివేశాల్లో కొత్తదనం లేక డీలాపడుతుంది. స్టువర్ట్ పురం ప్రజలని అటు విలన్ యలమంద, పోలీసులు పీక్కుతినే దృశ్యాల్లో రక్తపాతం హింస శృతిమించుతుంది. నాగేశ్వరరావు లక్ష్యం అక్కడ ఫ్యాక్టరీ పెట్టి ప్రజలకు చదువు, ఉపాధి కల్పించడం. అయితే ఈ లక్ష్యం చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు రిపీటెడ్ గా, సాగదీతగా వుంటాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు తప్పితే సెకండ్ హాఫ్ లో చెప్పుకోదగ్గ కథ ముందుకు కదలదు. ప్రీ క్లైమాక్స్ లో హేమలతా లవణంగా రేణు దేశాయ్ పాత్ర పరిచయం అయినప్పటికీ ప్రేక్షకుల్లో నిరాశ ఆవహించి వుటుంది. ఆ పాత్ర కూడా కథలో పెద్దగా మార్పు తీసుకురాదు. టైగర్ పాత్రకు పరోక్ష ఎలివేషన్ లా ఆ పాత్రని వాడుకున్న తీరు ఓవర్ సినిమాటిక్ లిబార్టి అనిపిస్తుంది.

ఇక ఈ కథ ముగించి తీరు కూడా సహనానికి పరీక్షలా వుంటుంది. జీడితోటల్లో మంచి యాక్షన్ సీక్వెన్స్ పెట్టారు కానీ దాన్ని ఓ రేంజ్ లో సాగదీశారు. హీరోకి పదుల సంఖ్యలో బుల్లెట్లు తగిలినా నింపాదిగా డైలాగులు చెబుతూనే ఉంటాడు. ఆ జీడితోటల్లోనే కథ ముగించి వుంటే బావుండేది. ఓ పది బుల్లెట్లు తగిలిన హీరోని విలన్ లొకేషన్ లోకి షిఫ్ట్ చేస్తారు. అక్కడ పెద్ద ఫైటు.. మ‌ళ్లీ గుండెల నిండా బుల్లెట్లు దిగుతాయి. అక్కడితో కూడా ఆగదు. ఇంకా డైలాగులు చెబుతూనే ఉంటాడు. ఎంత టైగర్ బయోపిక్ అయినా ఈ స్థాయిలో స్వేఛ్చ తీసుకోవడం కొంచెం విడ్డూరంగానే అనిపిస్తుంది.

టైగర్‌ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది. టైగర్ ఎలా ఉంటాడో పెద్దగా తెలీదు. అలాంటి పాత్రని తన స్వాగ్ తో చేసే ప్రయత్నం చేశారు రవితేజ. పాత్ర వయసుకు తగ్గట్టు లుక్స్ లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాల్లో కష్టపడ్డారు. చురుగ్గా చేశారు. డైలాగులు కూడా కాస్త గంభీరంగా చెప్పారు. అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా తన అనుభవాన్ని చూపించారు. సారా పాత్రలో చేసిన నుపూర్ సనన్ కి యావరేజ్ మార్కులే పడతాయి. నుపూర్ తో పోల్చుకుంటే గాయత్రికి కాస్త బెటర్ రోల్ దొరికింది. అనుపమ్ ఖేర్ హుందాగా కనిపించారు. ప్రధాని కార్యాలయం ఎపిసోడ్ కి ఆ సీరియస్ నెస్ రావడానికి ఆయన ప్రజన్స్ ఒక కారణం. జీషు క్రూరమైన పోలీస్ గా కనిపించాడు. నాజర్ పాత్ర బావుంది. టైగర్ కి ఎలివేషన్ ఇవ్వడానికి కూడా ఆ పాత్ర చక్కగా ఉపయోగపడింది. హేమలత లవణంగా చేసిన రేణు దేశాయ్ ఆ పాత్రలో చక్కగా కుదిరారు. విలన్ గా చేసిన యలమంద నటన బావుంది. అనుకృతితో పాటు మిగతా పాత్రలు ఉండాల్సిన పరిధిలో వున్నాయి.

జీవి ప్రకాష్ అందించిన పాటలు రిజిస్టర్ కావు కానీ నేపధ్య సంగీతం మాత్రం కుదిరింది. ఎమోషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ లలో జీవీ చేసిన స్కోర్ ప్రత్యేకంగా నిలిచింది. ఆర్ మధి కెమరాపనితనం కూడా మెప్పిస్తుంది. కొన్ని విజువల్స్ గ్రాండ్ గా తీశారు. ట్రైన్ సీక్వెన్స్ తో పాటు ఇంటర్వెల్ కి ముందు వచ్చే పోర్ట్ ఎపిసోడ్స్ బావుంటాయి. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ నేచురల్ గా వుంది. స్టువర్ట్ పురంని బాగానే రిక్రియేట్ చేశారు. చాలా సన్నివేశాల్ని పదునిచేయాల్సింది. నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. కొన్ని మాటలు మాస్ కి నచ్చేలా రాసుకున్నారు.

దర్శకుడు వంశీదగ్గర టైగర్ కి సంబధించి కావాల్సిన సమాచారం వుంది. అయితే ఏది గ్యాలరీకి చూపించాలి? ఏది చూపించకూడదనే విషయం పై స్పష్టత కొరవంది. చాలా విషయాలు చెప్పేయాల‌న్న‌ తాపత్రయం కనిపించింది. దీంతో టైగర్ క్యారెక్టర్ ప్రేక్షకులకి ఈ కోణంలో కనెక్ట్ అవుతుందో చెక్ చేసుకోవడంలో జడ్జ్మెంట్ తప్పింది. తండ్రి తల న‌రికిన కిరాతకుడిగా, సానివాడల్లో తిరిగే వ్యక్తిగా, కన్నుపడిన అమ్మాయిని అనుభవించే స్త్రీలోలుడిగా.. ఇలా చాలా నెగిటివ్ కోణాలు కూడా చూపించాడు. ఇవన్నీ టైగర్ నిజజీవితంలో ఉండొచ్చు, లేకపోవచ్చు. అయితే ఆ పాత్రని రాబిన్ వుడ్ గా చిత్రీకరించి ప్రేక్షకుల మనసులని గెలిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు.. తండ్రి తల నరికినవాడిని ఒక ఉన్మాది గానే చూస్తారు కానీ అతనిలో రాబిన్ వుడ్ ప్రేక్షకులకు కనిపించడనే వాస్తవాన్ని గ్రహించలేకపోయాడనే చెప్పాలి. గతంలో అతడు కిరాతకుడు .. తర్వాత గొప్పవాడిగా మారాడు.. ఏం ఇలా మారకూడదా ? అని అడగొచ్చు. మార్పు అనేది డైలాగుల్లో కాదు.. సన్నివేశాల్లో వుండాలి. పాత్ర ప్రయాణంలో వుండాలి. అలాంటి ప్రయాణం, మార్పు ఇందులో కనిపించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close