గుంభనంగా చేరికలు పూర్తి చేస్తున్న రేవంత్ రెడ్డి !

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరికల విషయంలో ఓ ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తున్నారు. పార్టీకి మేలు చేస్తారని భావిస్తున్న నేతల్ని ఎక్కడ ఉన్నా.. వెంటపడి చర్చలు జరిపి పార్టీలోకి తీసుకు వస్తున్నారు. బీఆర్ఎస్ టిక్కెట్లు ప్రకటించిన నేతల్ని కూడా రేవంత్ రెడ్డి ఆకర్షిస్తున్నారు. పొటెన్షియల్ అనుకున్న నేతల్ని ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. మైనంపల్లి హన్మంతరావుతో చర్చలు కూడా పూర్తి చేశారు. ఆయన ఆర్థికంగా బలవంతుడు కావడం.. తన కుమారుడ్ని ఎలాగైనా గెలిపించుకు వస్తారన్న నమ్మకం ఉండటంతో.. రెండు టిక్కెట్లు ఇచ్చేందుకు హైకమండ్ ను ఒప్పించారు.

తుమ్ముల నాగేశ్వరరావు ను కూడా రేవంత్ రెడ్డి పార్టీలో చేరేందుకు ఒప్పించారు. షర్మిల పార్టీ కి చెక్ పెట్టడానికి అయినా తుమ్మల చేరిక ముఖ్యం కావడంతో బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ తో చర్చలు జరిపి మరీ తుమ్మల చేరికకు మార్గం సుగమం చేశారు. పాలేరు లేదా ఖమ్మం నుంచి తుమ్మలను పోటీ చేయించేందుకు అవకాశం ఉంది. బీఆర్ఎస్‌లో టిక్కెట్లు దక్కినా కొంత మందిలో చివరి క్షణంలో బీఫాం ఇవ్వరేమోనన్న అనుమానాలతో ఉన్నారు. అలాంటి వారిని కూడా రేవంత్ టార్గెట్ చేస్తున్నారు. టిక్కెట్ దక్కిన వారిని చేర్చుకుంటే… బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని నమ్ముతున్నారు.

రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాత్మక చేరికలు ఉంటాయని రేవంత్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. గతంలో పదవుల కోసం… ఇతర ప్రలోభాలతో పార్టీని వీడిన నియోజకవర్గ స్థాయి నేతల్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉన్నా ప్రయోజనం ఉండదని.. కాంగ్రెస్ లో కి వస్తే ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. సర్వేల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోందన్న ఫలితాలు వస్తూండటంతో ఎక్కువ మంది చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close