న‌య‌న్ రికార్డ్ బ్రేక్ చేసిన త్రిష‌

ఒక‌ప్పుడు హీరోల‌తో పోలిస్తే, హీరోయిన్ల పారితోషికాలు చాలా త‌క్కువ‌గా ఉండేవి. ఎంత స్టార్ డ‌మ్ తెచ్చుకొన్నా – హీరోలకు ఇచ్చిన దాంట్లో సగం రెమ్యున‌రేష‌న్ కూడా వ‌చ్చేది కాదు. అయితే ఇప్పుడు ప‌రిస్థితి మారింది. క‌థానాయిక‌లు కూడా ఈ విష‌యంలో క‌థానాయ‌కుల‌తో పోటీకి వ‌స్తున్నారు. హీరోలతో స‌మానంగా, ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని సార్లు హీరోల కంటే ఎక్కువ‌గా పారితోషికాలు అందుకొంటున్నారు. ఈ విష‌యంలో న‌య‌నతార ఎప్పుడో రికార్డు సృష్టించేసింది. ద‌క్షిణాదిన కోటి రూపాయ‌లు అందుకొన్న తొలి క‌థానాయిక త‌నే. ఇప్ప‌టికీ సౌత్‌లో త‌నే ఖ‌రీదైన నాయిక‌. ఒక్కో సినిమాకి రూ.6 నుంచి 8 కోట్లు అందుకొంటోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అంటే రూ.10 కోట్లు త‌ప్ప‌నిస‌రి.

అయితే ఈ రికార్డుని ఇప్పుడు త్రిష బ్రేక్ చేసింది. ‘విశ్వంభ‌ర‌’ కోసం ఏకంగా రూ.12 కోట్ల పారితోషికం అందుకొన్న‌ట్టు తెలుస్తోంది. అదే నిజ‌మైతే తెలుగులోనే కాదు, ద‌క్షిణాదిలోనే అత్య‌ధిక పారితోషికం తీసుకొంటున్న క‌థానాయిక‌… త్రిష‌నే. ఇప్ప‌టి వ‌ర‌కూ న‌య‌న పేరుమీద ఉన్న రికార్డ్ ని త్రిష బ్రేక్ చేసిన‌ట్టే. సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష కెరీర్ మ‌రింత జోరుగా సాగిపోతోంది. ప్ర‌స్తుతం చిరుతో న‌టిస్తోంది. క‌మ‌ల్ హాస‌న్ – మ‌ణిర‌త్నం కాంబోలో త‌నే క‌థానాయిక‌. వెంక‌టేష్ సినిమాలోనూ క‌థానాయిక‌గా త్రిష పేరు వినిపిస్తోంది. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ న‌టించే సినిమాలోనూ త్రిష‌నే ఎంచుకొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాడు. వెట‌ర‌న్ హీరోలే కాదు, ఈత‌రం స్టార్లు కూడా త్రిష పేరే క‌ల‌వ‌రిస్తుంటే.. ఆమె పారితోషికం పెర‌గ‌కుండా ఎలా ఉంటుంది మ‌రి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

ఒక్క కేసీఆర్ మాటలే వినిపించాయా – అదీ నెల తర్వాత !

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close