పార్లమెంట్‌లోనూ బీజేపీతో టీఆర్ఎస్ కయ్యమే !

బీజేపీతో తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్న కేసీఆర్.. ఢిల్లీలో ఆ పోరాటాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో కూడా ఆందోళనలు చేయనున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో మధ్యలోనే బాయ్ కాట్ చేసి వచ్చారు. దీని వల్ల బీజేపీతో ఫ్రెండ్లీ ఫైట్ అనే విమర్శలు వచ్చాయి. ఈ సారి అలాంటి పరిస్థితి ఉండకుండా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.

తొమ్మిది మంది లోక్‌సభ, ఆరుగురు రాజ్యసభ సభ్యులతో కేసీఆర్ సమావేశం అయి… వారికి దిశానిర్దేశం చేయనున్నారు. బడ్జెట్లో తెలంగాణలో ఎప్పటిలాగానే మొండి చేయిచూపే అవకాశం ఉంది. దీన్నే ఆసరాగా చేసుకుని ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులకు ఇప్పటివరకు సానుకూల స్పందన రాకపోవడం, రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవాల్సిన అవసరం, కేంద్రం దగ్గర పేరుకుపోయిన బకాయిలు వాటిపై కేంద్రాన్ని నిలదీయాని కేసీఆర్ ఎంపీలకు సూచించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి పలు రకాల ఆర్థిక సాయాన్ని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు హరీశ్‌‌రావు, కేటీఆర్ ఇటీవల లేఖలు రాశారు. నవోదయ విద్యాలయాలు, రైల్వేకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ కూడా లేఖలు రాశారు. వీటిపై స్పందన రాకపోతే.. పార్లమెంట్ సమావేశాలను స్తంభింపచేయాలని కూడా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close