శ్రీవారి సేవలు @ జియో !

ఇటీవల శ్రీవారి దర్శన టిక్కెట్లు జియో మార్ట్‌లో బుక్ చేసుకోవాల్సి రావడంపై భక్తులు ఆశ్చర్యపోయారు. ఇక ముందు అలా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దర్శన టిక్కెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు, గదుల బుకింగ్ మొత్తం జియో ద్వారానే సాగుతుంది. దీనికి వచ్చే వైకుంట ఏకాదశి రోజు నుంచి ముహుర్తం ఖరారు చేశారు. మొత్తం బాధ్యతలన్నీ జియోకు అప్పగిస్తూ శుక్రవారమే ఎంవోయూ చేసుకున్నారు. ఈ ఎంవోయూ ప్రకారం ఇక టీటీడీకి సంబంధించి భక్తులకు అందే సేవలన్నీ జియో యాప్‌లో మాత్రమే లభ్యమవుతాయి. టీటీడీ వెబ్ సైట్‌ అవసరం ఇక ఉండదు.

టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు, సమస్త సమాచారం ఒకే చోట లభించేలా జియో సంస్థ ప్రత్యేకంగా యాప్ తయారు చేస్తుంది. ఈ యాప్ లో భక్తులకు అవసరమైన దర్శనం టిక్కెట్లు, రూముల బుకింగ్ వంటి సదుపాయాలన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం యాప్ పని జరుగుతోంది. టీటీడీ వె‌బ్ సైట్‌కు సాంకేతిక సమస్యలు వస్తూండటంతో జియో యాప్‌తో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. దానికి కారణంగా ఇటీవల లక్షల మంది భక్తులు టికెట్ కోసం ప్రయత్నించారని.. దీంతో టీటీడీ సర్వర్లలో సమస్యలు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఆ సమస్యలు రాకుండా ఉండేందుకే జియోతో ఒప్పందం అని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. నిజానికి అప్పుడు సమస్య వచ్చింది జియో సర్వర్లలోనే. టిక్కెట్ల బుకింగ్ కోసం క్లిక్ చేయాడనికి జియో మార్ట్‌కు రీ డైరక్ట్ అయింది.

గత ఐదేళ్లుగా టీటీడీకి టీసీఎస్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇప్పుడు కూడా టీసీఎస్ సమన్వయంతోనే జియో సంస్థ ఉచితంగా టీటీడీ ఐటి విభాగానికి మెరుగైన సేవలు అందిస్తుందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. రూ. కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్ ఉచితంగా ఇస్తున్నారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి . ఉచితంగా ఇవ్వడం అంటే.. టీటీడీకి సర్వర్ల సామర్థ్యం కల్పించి.. శ్రీవారి వెబ్ సైట్నుంచి సేవలు అందించడమే కానీ.. పెద్ద ఎత్తున ప్రచారం పొందేలా జియో యాప్ ద్వారా అందించడం కాదని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని ఎవరూ ప్రశ్నించరాదు. ప్రశ్నిస్తే కేసులు పెడతామనే హెచ్చరికలు తరచూ టీటీడీ వర్గాలు చేస్తూనే ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close