కాంగ్రెస్‌ కన్నా షర్మిలకే ఇప్పుడు అసలు పరీక్ష !

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టనున్నారు. షర్మిల ముందున్న మొదటి టార్గెట్ రాబోయే జమిలీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందన్న నమ్మకాన్ని కలిగించడం. అందు కోసం ప్రభావవంతమైన ఓటు షేర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే జీరో పొజిషన్‌లో ఉంది. ఆ పార్టీ పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఎంత వచ్చినా వచ్చినట్లే. అయితే షర్మిల పరిస్థితి అలా లేదు. కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుని షర్మిల బలం పెంచుకుంటేనే ఆమె రాజకీయ జీవితానికి కంటిన్యూటి ఉంటుంది.

ఇప్పటికే తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టి విఫలమయ్యారు. సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పార్డీని నడిపినా ప్రయోజనం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పేరుతో పోటీ నుంచి విరమించుకోవడం వ్యూహాత్మక నిర్ణయం. అక్కడ పోటీ చేసి ఉన్నట్లయితే ఇప్పుడు ఏపీలోకి ఎంట్రీ ఇచ్చినా ప్రభావం ఉండేది కాదు. అక్కడ పోటీ చేయకపోవడం వల్ల ఏపీలో రాజకీయ భవిష్యత్‌ను షర్మిల కాపాడుకోగలిగారు.

ఏపీలో రాజకీయాలు చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారంటే.. అన్నింటికీ సిద్ధపడి ఉంటారని అనుకోవాలి. తాను తలపడబోయే ప్రత్యర్థుల్లో కుటుంబసభ్యులు ఉంటారు. సొంత సోదరుడు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీతోనే ఆమె ఎక్కువ పోరాటం చేయాలి. ఎందుకంటే ఆ పార్టీ నుంచే ఓటు బ్యాంక్ వెనక్కి రావాల్సి ఉంది. ఇందు కోసం షర్మిల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చని చెబుతున్నారు. అందులో మొదటిది తాను స్వయంగా కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయడం.

షర్మిల తీసుకున్న టాస్క్ చిన్నది కాదు. అతి తక్కువ సమయంలోనే తన ప్రభావాన్ని ఏపీలో చూపించాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ మరో నెల.. నెలన్నరలో వస్తుందన్న ప్రచారం ఉంది. పార్టీని బలోపేతం చేసి తాను బలోపేతం కావాల్సిన క్లిష్టమైన చాలెంజ్ ను షర్మిల తీసుకున్నారు. ఎంత వరకూ ఈ విషయంలో పలితాలు సాధిస్తారనేది.. ఎన్నికల ఫలితాల తర్వాతే తేలుతుంది. గెలుపోటముల్ని మార్చే అంత ఓటింగ్ శాతం సాధిస్తే.. షర్మిలకు తిరుగులేని రాజకీయ భవిష్యత్ ఉంటుందని అంచనా వేయవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close