తెలకపల్లి : వారసత్వ ప్రకటనతో రెండు శిబిరాలు

Telakapalli-Raviతెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాజకీయ వారసుడుగా కెటిఆర్‌ స్థానం ఖాయం కావడంలో ఆశ్యర్యం లేదు గాని అందులోని హడావుడి మాత్రం ఒకింత ప్రశ్నార్థకం. మామూలుగా కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగితే మేయర్‌ వస్తాడు ఇక్కడ ఒక భావి ముఖ్యమంత్రి వచ్చారు అని నేను చాలాసార్లు వ్యాఖ్యానించాను. అందుకు రంగం సిద్ధం చేయడానికే కెసిఆర్‌ కుమారుడిని ముందునుంచి బాధ్యతల్లో పెట్టారు. ఇది ఈ దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలలోనూ అమలవుతున్న అనధికార సంప్రదాయం ప్రకారమే జరిగిన ప్రక్రియ.. మహారాష్ట్రలో రాజ్‌ – ఉద్భవ్‌ ఠాకరేలు, జమ్మూ కాశ్మీర్‌లో(1980లలో) ఫరూఖ్‌ అబ్దుల్లా ్‌- జి.ఎం.షాలు, బీహార్‌లో లాలూ పుత్రులు-బావ మరిది గతంలో వివాదపడిన ఉదాహరణలున్నాయి. తమిళనాడులో సవతి తమ్ములైన స్టాలిన్‌ అళగిరి ఇంటిపోరు బాగా తెలుసు. తెలుగుదేశంలోనూ మొదట చంద్రబాబు దగ్గుబాటిర్వాత ి లక్ష్మీపార్వతి , ఆ తర్వాత హరికృష్ణ వంటివారి మధ్య వివాదాలు కూడా అందరికీ తెలుసు. అసలు 1985 ఎన్నికల ప్రచార క్రమంలో ఎన్టీఆర్‌ బాలకృష్ణ నా వారసుడు అని ప్రకటించగానే దుమారం లేచింది. వారిద్దరినీ ఒకే సభలో చూపేందుకు తీసుకువెళ్లిన చంద్రబాబే ఆ ప్రకటన వెనక్కు వెళ్లేలా చూశారని ప్రచారం జరిగింది. ఇప్పుడంటే వారిద్దరూ వియ్యంకులే అయినా బాలయ్యను సిఎం చేయాలని చంద్రబాబు వ్యతిరేకులు అప్పుడప్పుడూ అంటుంటారు. ఆయన కూడా చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో అంటూనే బాలయ్య బావను బలపరుస్తుంటాడు. ఇవన్నీ చూశారు గనకే కెసిఆర్‌ ఏ సమస్య లేకుండా సూటిగా కెటిఆర్‌ను వారసుడుగా ప్రకటించే ప్రక్రియ పూర్తి చేశారు. టిఆర్‌ఎస్‌లో మొదటి నుంచి హూ ఈజ్‌ నెక్స్ట్‌ చర్చ లోలోపల వుంది. ఉద్యమ కాలంలో హరీష్‌ రావు నెంబర్‌ 2గా పేరు పొందారు. అయితే ప్రభుత్వం ఏర్పడగానే ఇతర పార్టీల నుంచి చాలామంది సీనియర్లను తీసుకురావడంలోనే ఆ పరిస్థితి మార్చే ప్రయత్నం జరుగుతున్నదని ఆ పార్టీ నాయకులు చెప్పేవారు. స్వతహాగా చురుకైన హరీష్‌ ఇవన్నీ గమనిస్తున్నా వాస్తవాలు తెలుసు గనక సర్దుబాటుతనం కొనసాగించారు. ప్రభుత్వంలో గాని పార్టీలో గాని ఏదైనా భారీ కదలిక జరగాలంటే హరీష్‌ జోక్యం తప్పనిసరి అనిి చెబుతుండేవారు. మొన్నటి చండీయాగం సమయంలోనూ ఆయనదే పెద్ద పాత్ర. కెటిఆర్‌కు ఇలాటివి పెద్దగా నమ్మకాలు లేకపోవడం కూడా ఒక కారణం. ఇవన్నీవున్నా వారసత్వ నిర్ణయం కూడా జరిగిపోయిందని జిహెచ్‌ఎంసి ఎన్నికలతో అందరికీ అర్థమైంది. దీన్నిఅధికారికంగానే అధినేత హరీష్‌కు చెప్పారన్నది ఒక ప్రజా ప్రతినిధి కథనం.’ కొడుకునైతే వదులుకోలేను కదా, నీ పనులు నీవు చేసుకోవచ్చు. అందుకు ఎలాటి ఆటంకాలు వుండవు’ అన్నారని ఆ వర్గాల కథనం. మరోవైపున తన కుటుంబ సభ్యులకూ రాజకీయంగా హరీష్‌ అవసరాన్ని వివరించి చెప్పారని ఒక ఎంపి తెలిపారు. ‘ఇప్పుడు హరీష్‌ బాడీ లాంగ్వేజ్‌ చూడండి.. ఇది వరకటి హుషారు లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్‌ ఉద్యమ కాలంలో తీవ్రంగా మాట్లాడారు గనక హైదరాబాదులో కెటిఆర్‌ను వినియోగిస్తున్నట్టు మొదట్లో భావించినా తర్వాత కెసిఆర్‌ అంతకంటే లోతుగానే ఆలోచించినట్టు తేలిపోయింది. మీడియా గోష్టిలో వారసత్వంపై ప్రశ్నలు వచ్చినపుడు వాటిని పూర్తిగా తోసిపారేయలేదు. బహిరంగసభలో కెటిఆర్‌ వీధి వీధి తిరిగాడని ప్రశంసించడమే గాక మునిసిపల్‌ శాఖనే అప్పగిస్తున్నట్టు ప్రకటించేశారు. ఆయన ఎంపి తనయ కవిత కూడా అన్నయ్యే వారసుడు అని ధృవీకరించి ఒక ఘట్టం ముగించారు. ఇవన్నీ యాదృచ్చికంగా జరిగినవి కావు. ఈ పరిణామాలు హరీష్‌ అనుచరుల్లో అసౌఖ్యం కలిగిస్తున్న మాట నిజం. ఇంత బాహాటంగా భావి నేతను ప్రకటించడం వల్ల ఆయనతో ఎలా మెలగాలన్నది ఒక సమస్య.అధికారం కోసం సర్దుకున్నా అసంతృప్తి అనివార్యమే. అయితే హరీష్‌ రావు కూడా వ్యూహాత్మకంగా అడుగులువేయడంలో ఆరితేరిన నేతగనక తేలిగ్గా బయిటపడరు. పైగా అంతర్గత సమస్యలు వచ్చినపుడు ఆయన తెలుగుదేశం కాంగ్రెస్‌లపై తీవ్రంగా దాడి చేసి వేడిపెంచుతుంటారు. గతంలో కెసిఆర్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తాననడం గాని కొన్ని సందర్భాల్లో తీసుకున్న చర్యలు గాని హరీష్‌ ఆమోదించలేదు. వాస్తవానికి ఆయన ఒక దశలో వైఎస్‌కు బాగా దగ్గరైన రోజులున్నాయి. కాని పార్టీతోనే నిలబడి తనకంటూ ఒక ఫాలోయింగ్‌ పెంచుకున్నారు. ఇప్పుడు కూడా మంత్రిగా యువనాయకుడుగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన తప్పక ప్రయత్నం చేస్తారు. బయిట ప్రత్యర్థి పార్టీలను చిత్తుచేసిన కెసిఆర్‌ ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌లో రెండు అంతర్గత శిబిరాలు ఏర్పడటానికి కారకులైనారు. ఇప్పటికైతే ఎవరూ బయిటపడకపోవచ్చు గాని లోలోపల సందేహాలు దూరాలు పెరుగుతూనే వుంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close