డాన్స్ చేయ‌లేను.. పాట తీసేయండి ప్లీజ్‌!

హీరోలు, ముఖ్యంగా కుర్ర హీరోలు డాన్స్ నెంబ‌ర్ల‌పై ఎక్కువ‌గా దృష్టి పెడుతుంటారు. ఆల్బ‌మ్‌లో ఒక్క పాటైనా మంచి బీటున్న పాటుంటే బాగుంటుంద‌నుకుంటారు. త‌మ డాన్సింగ్ టాలెంట్ మొత్తం ఆ పాట‌లో చూపించ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతుంటారు. మెగా హీరోలంతా డాన్సుల్లో ఆరి తేరిపోయిన వాళ్లే. ఉప్పెన‌తో… ఎంట్రీ ఇచ్చిన వైష్ణ‌వ్ తేజ్‌లోని డాన్సింగ్ టాలెంట్ స‌రిగా చూసే అవ‌కాశం ఇప్ప‌టి వ‌ర‌కూ రాలేదు. ఉప్పెన‌లో డాన్సింగ్ నెంబ‌ర్లు లేవు. కొండ పొలెంలోనూ అంతే. ఇప్పుడు `రంగ రంగ వైభ‌వంగా`లోనూ అలాంటి పాట ప‌డ‌లేదు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు. త‌న ఆల్బ‌మ్ లో క‌చ్చితంగా ఊపున్న పాట ఒక్క‌టైనా ఉంటుంది. కానీ… `రంగ‌.. రంగ‌`లో అదీ క‌నిపించ‌లేదు.

నిజానికి… సెకండాఫ్ లో దేవీ మార్కు ఉన్న ఓ పాట ఉంద‌ట‌. అందులో మంచి డాన్స్ మూమెంట్స్ వేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ట‌. కానీ వైష్ణ‌వ్ తేజ్ మాత్రం ‘ఆ పాటకు త‌గినట్టుగా డాన్స్ చేయ‌లేను. ఆ పాట తీసేద్దాం’ అని చెప్పేస‌రికి… రికార్డింగ్ చేసిన పాట‌ని ప‌క్క‌న పెట్టేశార్ట‌. వైష్ణ‌వ్ మంచి న‌టుడే. కానీ.. డాన్సుల్లో ఇంకా సాధన చేయాల్సివుంది. మెగా హీరో మంచి డాన్స్ నెంబ‌ర్‌కి స్టెప్పులు వేశాడంటే.. అంతా అటువైపు ఆస‌క్తిగా చూస్తారు. యావ‌రేజ్ స్టెప్పుల‌తో మెగా ఫ్యాన్స్ ని ఆక‌ట్టుకోలేరు. అందుకే… డాన్సుల్లో మ‌రింత శిక్ష‌ణ తీసుకొన్న త‌ర‌వాతే.. వెండి తెర‌పై అలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తానంటున్నాడు వైష్ణ‌వ్‌. ఓ ర‌కంగా ఇది మంచి నిర్ణ‌య‌మే. వ‌చ్చీ రాని స్టెప్పుల‌తో ఏవో ప్ర‌య‌త్నాలు చేసేదానికంటే, డాన్సుల్లో గ్రిప్పు వ‌చ్చేకే.. స్టెప్పులు వేయ‌డం మంచిది క‌దా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close