ఇది తెలుగు ‘పీకే’

అమీర్ ఖాన్ సినిమా ‘పీకే’ గుర్తుంది క‌దా? అందులో అమీర్ ఓ గ్ర‌హాంత‌ర వాసి. ఈ భూమ్మీద అనుకోని ప‌రిస్థితుల్లో ఉండిపోవాల్సివ‌స్తుంది. ఇక్క‌డ దిగాక‌.. దేవుళ్ల‌తో ఓ ఆట ఆడుకుంటాడు. అటూ ఇటుగా ‘వీర భోగ వ‌సంత రాయులు’ సినిమా కూడా ఇదే పాయింట్‌పై న‌డుస్తుందేమో అనిపిస్తోంది. నారా రోహిత్‌, శ్రీ‌విష్ణు, సుధీర్‌బాబు క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న సినిమా ఇది. శ్రియ ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇందులో శ్రీ‌విష్ణు గ్ర‌హాంత‌ర వాసిగా క‌నిపించ‌నున్నాడు. టీజ‌ర్లో మ‌తాలు, దేవుళ్ల‌కు సంబంధించిన ఓ డైలాగ్ ఉంది.

“నాకు తెలుసు మీరు వాళ్ళ రాక కోసం ఎన్ని పూజలు ప్రార్థనలు చేస్తున్నారో అని. నాకు తెలుసు మీరు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఎలాగైనా వస్తారని. ఎందుకంటే మీలాగా ఎదురు చూసే వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి. ఎదురు చూశాం.. ఎదురు చూశాం.. క్షణాలు కాదు.. నిముషాలు కాదు.. గంటలు కాదు.. రోజులు కాదు.. నెలల తరబడి ఎదురు చూశాం. కానీ వాళ్ళు మాత్రం తిరిగి రాలేదు. సో.. టుడే వీ నీడ్ టు బ్రేక్ ద సైలెన్స్. టుడే వీ నీడ్ తో మేక్ సెన్స్. టుడే వి నీడ్ టు గెట్ ప్రాక్టికల్.ష – అంటూ సాగే ఈ డైలాగ్ చూస్తుంటే.. క‌చ్చితంగా ఈ సినిమా కూడా ‘పీకే’లానే దేవుళ్లు, మూఢ‌న‌మ్మ‌కాలు, బాబాల‌పై గురి పెట్టిన బాణంలా అనిపిస్తోంది. ‘ప్ర‌తినిధి’ లాంటి సినిమాల‌తో సామాన్యుల్ని షేక్ చేశాడు నారా రోహిత్‌. సామాన్యుల మ‌న‌సులో ఉన్న ప్ర‌శ్న‌ల్ని వెండి తెర‌పై స‌న్నివేశాలుగా రంగ‌రించాడు. ఇప్పుడూ అదే ప్ర‌య‌త్నం జ‌రిగిందేమో అనిపిస్తోంది. ఈ సినిమాలో ఓ షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంద‌ని చిత్ర‌బృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. టీజ‌ర్ చివ‌ర్లో కూడా అది క‌నిపిస్తుంది. గుర్రం మీద వ‌స్తున్న ఓ వ్య‌క్తి.. క‌నీక‌నిపించ‌న‌ట్టుగా క‌నిపిస్తాడందులో. అది శ్రీ‌విష్ణునే. ఆ పాత్ర గ్ర‌హంత‌ర వాసి కాబ‌ట్టి.. ఇప్పుడే రివీల్ చేయ‌డం ఇష్టంలేక శ్రీ‌విష్ణుని అలా నీడ‌లోనే దాచేశార‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close