‘వెంకీ మామ’ టీజ‌ర్‌: మామా అల్లుళ్ల హంగామా

టాలీవుడ్‌లో మెర‌వ‌బోతున్న మ‌రో మ‌ల్టీస్టార‌ర్ ‘వెంకీ మామ‌’. నిజ జీవితంలో మామా అల్లుళ్లైన వెంక‌టేష్ – నాగ‌చైత‌న్య ఈ సినిమాలో అవే పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ క‌థానాయిక‌లు. ద‌స‌రా సంద‌ర్భంగా టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లో వెంకీ, చైతూల బంధాన్ని ఎలివేట్ చేయ‌డానికే ప్రాధాన్యం ఇచ్చారు. ‘జై జ‌వాన్ – జై కిసాన్‌’ అనే స్లోగ‌న్ నుంచి టీజ‌ర్ క‌ట్ చేశారు. అంటే వెంకీ రైతుగా, చై – సైనికుడిగా క‌నిపించ‌బోతున్నార‌న్న‌మాట‌. అయితే ఈ టీజ‌ర్‌లోని డైలాగుల‌న్నీ… వెంకీవే.

గోదావ‌రిలో ఈత నేర్పా..
బ‌రిలో ఆట నేర్పా..
ఇప్పుడు జాత‌ర‌లో వేట నేరిస్తా..
– అంటూ రౌడీల భ‌ర‌తం ప‌ట్టాడు వెంకీ. చివ‌ర్లో `ఐ ల‌వ్ యూ అనేసిందిరా అల్లుడూ` అంటూ త‌న‌దైన కామిక్ టైమింగ్‌తో న‌వ్వులు పంచాడు. మొత్తానికి టీజ‌ర్ ప్రామిసింగ్‌గానే ఉంది. అయితే ఈ క‌థ‌కు సంబంధించిన లైన్ మాత్రం రివీల్ కాకుండా ద‌ర్శ‌కుడు జాగ్ర‌త్త ప‌డ్డాడు. విజువ‌ల్స్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, ఇద్ద‌రు హీరోల లుక్స్ అన్నీ కూల్‌గానే ఉన్నాయి. మ‌రి.. వెండి తెర‌పై ఈ మామా అల్లుళ్లిద్ద‌రూ ఇంకెంత మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.