బాలీవుడ్ లో మరో విషాదం: రిషి క‌పూర్ క‌న్నుమూత‌

నిన్న‌నే విల‌క్ష‌ణ న‌టుడు ఇమ్రాన్ ఖాన్‌ని కోల్పోయి కంట త‌డి పెట్టింది చిత్ర‌సీమ‌. ఆ బాధ‌ నుంచి తేరుకోక‌ముందే మ‌రో విషాదం చుట్టుముట్టింది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు రిషి క‌పూర్ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 67 ఏళ్లు. గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న క్యాన్స‌ర్‌తో బాధ ప‌డుతున్నారు. తాజాగా శ్వాస కోస సంబంధిత స‌మ‌స్య‌లు కూడా చుట్టిముట్ట‌డంతో ఆయ‌న్ని మ‌ళ్లీ ఆసుప‌త్రిలో చేర్చారు. ఈరోజు ఉద‌యం ఆయ‌న ప‌రిస్థితి విష‌మించింది. డాక‌ర్టు ఎంత ప్ర‌య‌త్నించినా లాభం లేకుండా పోయింది. గ‌త యేడాది సెప్టెంబ‌రులో అమెరికాలో కాన్స‌ర్‌కి సంబంధించిన చికిత్స తీసుకున్నారు రిషి క‌పూర్‌. ఆ త‌ర‌వాత ఆయ‌న్ని అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుమ‌డుతూనే ఉన్నాయి. ఏప్రిల్ నుంచి ఆయ‌న ప‌రిస్థితి మ‌రింత క్షీణించింది.

1952 సెప్టెంబ‌రు 4న ముంబైలో జ‌న్మించారు రిషి క‌పూర్‌. తండ్రి రాజ్ క‌పూర్‌తో క‌లిసి తొలిసారి మేరా నామ్ జోక‌ర్ (1970)లో న‌టించారు. అప్ప‌టి నుంచి న‌ట‌నే జీవితం అయ్యింది. బాబీ సినిమాతో బాలీవుడ్ దృష్టిని త‌న‌వైపుకు తిప్పుకున్నారు. మోస్ట్ రొమాంటిక్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. రిషి క‌పూర్ న‌టించిన‌వ‌న్నీ దాదాపుగా ప్రేమ‌క‌థ‌లే. అవే ఆయ‌న‌కు గుర్తింపు తీసుకొచ్చాయి. స‌ర్గం, కూలీ, ప‌తీ ప‌త్నీ ఔర్ ఓ, హ‌వాల‌త్‌, ఖ‌జానా, సింధూర్‌, విజ‌య్‌, చాందినీ… ఇలా క‌పూర్ సినీ జీవితంలో ఎన్నో మంచి సినిమాలున్నాయి. ఈమ‌ధ్య కాలంలో ముల్క్‌, క‌పూర్ అండ్ స‌న్స్‌, 102 నాట్ అవుట్ చిత్రాల్లో న‌టించి మెప్పించారు. ఆ అబ్ లౌట్ చ‌లే చిత్రంతో ద‌ర్శ‌కుడిగానూ మారారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close