తాత‌య్య‌కు ప్రేమ‌తో.. అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి పోస్ట‌ర్ల‌పై వీహెచ్ దుమ్మెత్తిపోసిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఆ విష‌యం ఎక్కడ మ‌ర్చిపోతారో అనుకొన్నాడో ఏమో.. వీలైన‌ప్పుడ‌ల్లా అర్జున్ రెడ్డిని కెలికేస్తూ మీడియాని ఆక‌ర్షిస్తున్నారు పెద్దాయ‌న‌. కేటీఆర్ ఈ సినిమాని చూసి మెచ్చుకోవ‌డం ఆయ‌న‌కు బొత్తిగా న‌చ్చ‌లేదు. డ్ర‌గ్స్‌, మ‌ద్య‌పానంని స‌పోర్ట్ చేసిన సినిమాని మెచ్చుకొని స‌భ్య స‌మాజానికి ఏం సందేశం ఇచ్చావ్ అంటూ కేటీఆర్‌ని నిల‌దీశారు వీహెచ్. అక్క‌డితో ఆగ‌లేదు. ద‌గ్గ‌రి బంధుత్వం ఉంది కాబ‌ట్టి… అర్జున్ రెడ్డి సినిమాని వెన‌కేసుకొస్తున్నావ్ అంటూ కౌంట‌ర్ వేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై అర్జున్ రెడ్డి విజ‌య్ దేవ‌ర‌కొండ ఆయ‌న‌కు దిమ్మ తిరిగే కౌంట‌ర్ ఇచ్చాడు. డియ‌ర్ తాత‌య్య అంటూ ఫేస్ బుక్‌లో ఓ మెసేజ్ పోస్ట్ చేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. కేటీఆర్‌ని నా బంధువుని చేశావ్‌.. అలాగైతే ఈ సినిమాని మెచ్చుకొన్న రాజ‌మౌళి నాకు తండ్రి.. రానా ద‌గ్గుబాటి, నాని, శ‌ర్వానంద్‌, వ‌రుణ్‌తేజ్ నాకు సోద‌రులు.. స‌మంత‌, అను ఇమ్మానియేల్‌, మెహ‌రీన్ నా మ‌ర‌దళ్లు అనుకోవాలా..?

5 రోజుల్లో 5 వేల షోస్‌ని హౌస్ ఫుల్ చేసిన తెలుగు ప్రేక్ష‌కులు నా క‌వ‌ల సోద‌రులా? అంటూ సెటైర్లు వేశాడు. ఆర్జీవి మ‌న ఇద్ద‌రిలో ఎవ‌రికి తండ్రో ఇంకా క్లారిటీ లేదంటూ జోక్ పేల్చాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిన ఈ కామెంట్లు ప్ర‌స్తుతం హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వీటిపై వీహెచ్ తాత‌య్య ఎలా స్పందిస్తాడో చూడాలి. అంతా బాగానే ఉంది గానీ, ఈ సంద‌డిలో స‌మంత‌ని మ‌ర‌ద‌లు చేసేశాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. చైతూ రియాక్ష‌న్ ఏమిటో మ‌రి..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close