దటీజ్ రాములమ్మ..! గౌరవంలో ఇంచ్ తేడా వచ్చినా నో కాంప్రమైజ్..!

విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎక్కడ తన రాజకీయ జీవితం ప్రారంభించారో.. మళ్లీ అక్కడికే చేరుకున్నారు. ఈ మధ్యలో సొంత పార్టీ.. తెలంగాణరాష్ట్ర సమితి.. కాంగ్రెస్ పార్టీల భ్రమణం పూర్తి చేశారు. ఆమె ఎక్కడ ఉన్నా పొటెన్షియల్ లీడరే కాబట్టి… ఆమె రేంజ్ ఆమెకు ఉంటుంది. ఆ విషయంలో ఆమెకు స్పష్టత ఉంది. పార్టీలో చేరుతున్నారు కదా.. అని లైట్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం ఆమె కాంప్రమైజ్ కారు. ఆ విషయం.. బీజేపీలో చేరే సమయంలోనే.. ఆ పార్టీ నేతలకు అనుభవపూర్వకంగా తెలిసేలా చేశారు. అసలేమంయిందంటే…. రాములమ్మను పార్టీలో చేరేలా ఒప్పించి.. ఢిల్లీ తీసుకెళ్లారు బీజేపీ నేతలు. ఆమెకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీ కండువా కప్పుతామని చెప్పారు. దానికి విజయశాంతి అంగీకరించారు. అంతకు ముందే అమిత్ షాతో భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే.. దానికీ అంగీకరించారు. ఆదివారం అమిత్ షాతో సమావేశమయ్యారు.

సోమవారం ఆమె పార్టీలో చేరే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే జేపీ నడ్డా చాలా బిజీగా ఉండటంతో… మరో జాతీయ ప్రధాన కార్యదర్శితో పార్టీ కండువా కప్పించి… సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయంలో విజయశాంతికి పూర్తి సమాచారం రాలేదు. తీరా… బీజేపీ ఆఫీసులోకి వెళ్లిన తర్వాత నడ్డా కనిపించలేదు. అరుణ్ సింగ్ అనే నేత వచ్చి .. సభ్యత్వం ఇచ్చి.. పార్టీ కండువా కప్పబోయారు. దానికి ఆమె అంగీకరించలేదు. తనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రమే కండువా కప్పాలని తేల్చేశారు. దీంతో అరుణ్ సింగ్ చిన్నబుచ్చుకున్నారు.

అరుణ్ సింగ్ చిన్న బుచ్చుకుంటారనో.. కిషన్ రెడ్డి మొహమాట పెట్టాడనో..తన రేంజ్‌ను తగ్గించుకనేందుకు రాములమ్మ సిద్ధంగా లేరు. నిర్మోహమాటంగా.. తనకు జేపీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందేనని తేల్చి చెప్పారు. అంతే.. నడ్డా ఎప్పుడు రెండు నిమిషాలుఖాళీ అవుతారో చూసి.. అప్పుడు ఆమెను పిలిచికండువా కప్పారు. రాత్రి సమయంలో ఆకండువా కప్పే పని పూర్తి కావడంతో.. విజయశాంతిని బీజేపీలో చేర్చే టాస్క్‌ను తీసుకున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. విజయశాంతి గ్లామర్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తమిళనాడులోనూ ఉపయోగపడుతుందన్న కారణంగా.. విజయశాంతిని నొప్పించకుండా.. బీజేపీ నేతలు వ్యవహరించినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close