గులకరాయి కేసులో నిండా మునిగింది బెజవాడ పోలీసులే !

గులకరాయి కేసులో పోలీసులు రాజకీయం చేయబోయి నిండా మునిగిపోయారన్న సెటైర్లు పోలీసు శాఖలోనే వినిపిస్తున్నాయి. ఓ మైనర్ ను ఇరికించడానికి తప్పుల మీద తప్పులు చేశారు. తర్వాత అదే మైనర్ ను అడ్డం పెట్టుకుని ఓ టీడీపీ కార్యకర్త ద్వారా ఏకంగా బొండా ఉమనే అరెస్టు చేయడానికి ప్లాన్ చేశారు. అంతా ఓ ప్రణాళిక ప్రకారం చేశారు. కానీ ఎన్ని కథలు చెప్పినా దొరికిపోవడం ఖాయమని తేలిపోవడంతో చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు.

రిమాండ్ రిపోర్టు మొత్తం తప్పుల తడకగా ఉంది. సాక్షులుగా వైసీపీ నేతలు.. పులివెందులకు చెందిన వ్యక్తిని పెట్టారు. కనీసం రాయి దొరకలేదు. దుర్గారావు అనే వ్యక్తిని తీసుకెళ్లి తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. చివరికి అతన్ని వదిలి పెట్టారు. కనీసం ఆ రాయి విసిరినట్లుగా చెబుతున్న వ్యక్తికి.. ఈ దుర్గారావుకు సంబంధమే లేదు. ఒక వీధిలో ఉన్నప్పటికీ… పెద్దగా తిరగరు. తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేయాలని చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఇప్పటికే డాక్టర్ సర్టిఫికెట్ పేరుతో తప్పుడు బర్త్ సర్టిఫికెట్ ను ప్రధాన నిందితుడి పేరుతో సృష్టించారు.

ఇది సాదా సీదా తప్పుడు కేసు కాదు. ఏకంగా రాజకీయ నేతల మీద చేస్తున్న కుట్ర. రేపు ఎన్నికల్లో అధికారం మారితే వారు ఎందుకు ఊరుకుంటారరు ?. తెలంగాణలో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. అక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రమే.. ఇక్కడ అడ్డగోలుగా తప్పుడు కేసులు.. పత్రాలు సృష్టి వంటి పనులకు పాల్పడుతున్నారు. ప్రధాన నిందితుడిపైన కనీస సాక్ష్యం లేకుండా.. అతన్ని బెదిరించి ఇప్పించిన స్టేట్ మెంట్‌నే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close