37 భాషల్లో విక్రమ్ ‘కర్ణ’…

ఇండియన్ సినిమాలకు ‘బాహుబలి’ కొత్త మార్కెట్ చూపింది. సిన్మా స్టార్టింగ్ నుంచి కరెక్ట్ ప్లానింగుతో వరల్డ్ క్లాస్ సినిమా తీసి, మార్కెటింగ్ చేసుకుంటే హాలీవుడ్ సినిమాల స్థాయిలో వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు వసూళ్లు సాధించడం పెద్ద కష్టం కాదని నిరూపించింది. దాంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ భారీ బడ్జెట్ ఫాంటసీ ఫిల్మ్స్ తీయడానికి రెడీ అవుతున్నారు. ‘బాహుబలి’ తర్వాత అనౌన్స్ చేసిన భారీ బడ్జెట్ ఫాంటసీ ఫిల్మ్స్ లో ‘మహావీర్ కర్ణ్‌’ ఒకటి. తమిళ్ స్టార్ విక్రమ్ హీరోగా మలయాళీ దర్శకుడు ఆర్.ఎస్. విమల్ హిందీలో తీయనున్న ఈ సినిమా బడ్జెట్ రూ.300 కోట్ల. రిలీజ్ కూడా అదే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 37 భాషల్లో విడుదల ఈ సినిమాను చేయనున్నట్టు విక్రమ్ తెలిపారు. “జస్ట్ బిజినెస్‌ కోసం అన్ని భాషల్లో విడుదల చేయడం లేదు. ‘టెన్‌ కమాండ్‌మెంట్స్‌’, ‘బెన్‌హర్‌’ సిన్మాలు ప్రపంచంలోని అన్ని భాషల ప్రేక్షకుల్నీ ఎలా ఆకట్టుకున్నాయో… మన మహాభారతంలోని కర్ణుడి కథ సైతం అంతమందినీ ఆకట్టుకుంటుంది” అని విక్రమ్ పేర్కొన్నారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ‘మహావీర్ కర్ణ్‌’ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. వచ్చే నెలలో సినిమా కంప్లీట్ డీటెయిల్స్ అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవుతారని విక్రమ్ చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close