నాని-శ్రీరెడ్డి.. మధ్యలో విశాల్

అర్థనగ్న నిరసన ప్రదర్శనతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న శ్రీరెడ్డి, అలా వచ్చిన పాపులారిటీ ఇంకా జనాల్లో ఉండటం కోసం అంతే స్థాయిలో తీవ్ర ఆరోపణలు విమర్శలతో హాట్ టాపిగ్ గా నిలుస్తోంది. శేఖర్ కమ్ముల, కోన వెంకట్ లతో సలహా చాలా మంది సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. హీరో నానిపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయంలో నాని ఆమెకు లీగల్ నోటీసులు కూడా పంపాడు.

కాగా ఈ వివాదంలో తాజాగా హీరో విశాల్ స్పదించాడు. నానికి మద్దత్తు పలికాడు. నాని నాకు మంచి స్నేహితుడు. స్నేహితుడని నానికి మద్దతు తెలపడంలేదు. నాని గురించి తెలిసిన వారికి అతను మహిళల పట్ల ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారో తెలుసు. ఒకవేళ శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే కేవలం పేర్లు బయటపెడితే సరిపోదు. ఆధారాలు చూపించాలి. ఆమె వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఇతరులను ఇష్టం వచ్చినట్లు టార్గెట్ చేస్తోందని అర్థమవుతోంది. నన్ను కూడా టార్గెట్‌ చేస్తుందేమో” అన్నాడు విశాల్. మరి విశాల్ కామెంట్స్ పై శ్రీరెడ్డి రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.