కేంద్ర హోంశాఖనే రంగంలోకి దింపిన విష్ణువర్ధన్ రెడ్డి..!

నోరున్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు.. సోషల్ మీడియా విషయంలో తన పవిత్రతను నిరూపించుకోవడానికి.. కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం.. ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి బయట పడిన అనేక కులపరమైన ట్వీట్లు.. మహిళలు, హీరోయిన్లపై అసభ్యకరమైన వ్యాఖ్యల డంప్.. కంపు ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. అది తనది కాదని.. చెప్పుకోవడానికి విష్ణువర్ధన్ రెడ్డి.. ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో.. ఓ లేఖ రాశారు. అయితే.. అందులో.. అది తనదేనని… ఇతురులు మెయిన్‌టెయిన్ చేస్తున్నారని.. ఆ ట్వీట్లకు తనకు సంబంధం లేదని.. చెప్పుకొచ్చారు. అయితే.. అది వర్కవుట్ అవులేదనుకున్నారో ఏమోకానీ.. కొత్తగా.. ఈ సారి ఢిల్లీలో ఓ ఫిర్యాదు చేశారు. నేరుగా.. కేంద్ర హోంశాఖకే ఫిర్యాదు చేశారు.

తన పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ నడుపుతున్నారని… వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రంలో ఉన్నది ఆయన పార్టీనే కాబట్టి వెంటనే… కేంద్ర హోంశాఖ కూడా.. విష్ణువర్ధన్‌రెడ్డి పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్ నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఫేక్ అకౌంట్ నడుపుతున్న వారిని గుర్తించి..శిక్షించాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరుతున్నారు. అది ఫేక్ ట్విట్టర్ అకౌంట్ అయితే… స్థానిక పోలీసులకో.. సైబర్ క్రైమ్ కో ఫిర్యాదు చేస్తారు కానీ.. విష్ణువర్ధన్ రెడ్డి… మరింత సీరియస్ గా తీసుకున్నారు. నేరుగా… కేంద్ర హోంశాఖ వద్దకే వెళ్లారు. తన పరువంతా.. సోషల్ మీడియాలో తీసేస్తున్నారని … సహాయమంత్రి కిషన్ రెడ్డికి చెప్పుకుని బాధపడి.. విచారణకు ఆదేశించుకునేలా చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే.. ఈ అకౌంట్‌పై సీరియస్ గా విచారణ చేస్తే.. బయటపడే విషయాలు ఆయనకే షాక్ ఇస్తాయి కదా ..అని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. ఎంతైనా.. పెద్ద నోరున్న విష్ణువర్ధన్ రెడ్డి.. ఇప్పుడు బయటకు వచ్చి… విమర్శలు చేయాలంటే.. ఏదో విధంగా.. తన ట్వీట్టర్ నిజాయితీని నిరూపించుకుని మిస్టర్ క్లీన్ అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా విచారణ వేయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close