‘విశ్వంభ‌ర‌’… చిరు కోసం వెయిటింగ్‌!

భోళా శంక‌ర్ త‌ర‌వాత చిరంజీవి అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ తీసుకొని చేస్తున్న సినిమా ‘విశ్వంభ‌ర‌’. వ‌శిష్ట ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. యూవీ క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తోంది. ఇది వ‌ర‌కే కొంత మేర షూటింగ్ జ‌రిగింది. అయితే చిరంజీవి మాత్రం సెట్లోకి ఎంట్రీ ఇవ్వ‌లేదు. ఫిబ్ర‌వ‌రి తొలి వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసింది టీమ్‌. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం పాల్గొంటార‌ని స‌మాచారం.

అయోధ్య‌లోని రామ‌మందిరం ప్రారంభోత్స‌వంలో పాల్గొన్న చిరు.. హైద‌రాబాద్ తిరిగొచ్చారు. ఈసారి ప్ర‌క‌టించే ప‌ద్మ అవార్డుల్లో చిరుకి ప‌ద్మ విభూష‌న్ ద‌క్క‌బోతోంద‌ని ముందే లీకులు వ‌చ్చేశాయి. చిరుకి ప‌ద్మ విభూష‌న్ వ‌స్తుందా, రాదా? అనే ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది. చిరంజీవి మాత్రం ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా ‘విశ్వంభ‌ర‌’ కొత్త షెడ్యూల్ పై ఫోక‌స్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. హైద‌రాబాద్ లో జ‌రిగే ఈ కొత్త‌ షెడ్యూల్ లో త్రిష కూడా అడుగు పెట్ట‌బోతోంద‌ని తెలుస్తోంది. చిరు ఈ సినిమాలో భీమ‌వ‌రం దొర‌బాబుగా, ఐదుగురు చెల్లాయిల ముద్దుల అన్న‌య్య‌గా క‌నిపించ‌బోతున్నారు. ఆ పాత్ర‌ల కోసం పేరున్న క‌థానాయిక‌ల కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన గ్లింప్స్ ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క‌లిగించింది. ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close