వి.ఎన్‌.ఆదిత్య కాన్ఫిడెన్స్ ఏమిటో..?

‘మ‌న‌సంతా నువ్వే’ లాంటి పాత్ బ్రేకింగ్ చిత్రాన్ని అందించాడు వి.ఎన్ ఆదిత్య‌. ఆ త‌ర‌వాత స్టార్ హీరోల‌తో ప‌నిచేశాడు. నిర్మాత‌గానూ మారాడు. కానీ… ఆ స్థాయి విజ‌యం మాత్రం ల‌భించ‌లేదు. చాలా కాలం ఆయ‌న సినిమాలే తీయ‌లేదు. ఇప్పుడు, ఇంత కాలానికి… ‘వారిద్ద‌రి మ‌ధ్య ‘ అనే ఓ యూత్ ఫుల్ చిత్రాన్ని తీశారు. సినిమా పూర్త‌యింది. ఏప్రిల్‌లో విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప‌బ్లిసిటీ డిఫ‌రెంట్‌గా సాగుతోంది. ముఖ్యంగా పోస్ట‌ర్ల‌లో హీరో, హీరోయిన్లు క‌నిపించ‌కుండా… యానిమేష‌న్ల‌తో న‌డిపించేస్తున్నాడు.

దానికితోడు సోష‌ల్ మీడియాలో.. కొన్ని సాహ‌సోపేత‌మైన కామెంట్లు చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. త‌న‌ని హీరోలు, హీరోయిన్లు ఎలా తిప్పించారో, ఈ క‌థ‌ని ఎలా రిజెక్ట్ చేశారో చెబుతూ ఓ సెటైరిక‌ల్ పోస్ట్ ని ఎఫ్‌.బీలో పెట్టాడు ఆదిత్య‌. `హీరోయిన్ న‌చ్చ‌లేదు. ఆమెను చూస్తే ప్రేమించాల‌నిపించ‌డం లేదు. కాబ‌ట్టి ఈ సినిమా వ‌దులుకుంటున్నాను` అని ఓ హీరో చెప్ప‌డం హైలెట్ అస‌లు. ఫ‌లానాహీరో న‌టిస్తే నేను చేయ‌ను అని ఓ హీరోయిన్ మొహం మీదే చెప్పేసింద‌ట‌. యూత్ ద‌ర్శ‌కుల‌తో మాత్ర‌మే చేస్తాన‌ని మ‌రో హీరో అన్నాడ‌ట‌. అలా.. ఈ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడ్ని బాగా ఆడుకున్నారు. అయితే… వాళ్లంద‌రికీ స‌మాధానం ఈ సినిమాతోనే చెబుతానన్న ధీమా వ్య‌క్తం చేస్తున్నాడు ఈ వెట‌రన్ డైరెక్ట‌ర్‌. ఇదంతా కాన్ఫిడెన్సా? ఓవ‌ర్ కాన్ఫిడెన్సా? అనేది.. సినిమా చూస్తే గానీ తెలీదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close