చైతన్య : ఏపీలో ఓట్ల గల్లంతు – ఈ మాత్రం దానికి ఎన్నికలు అవసరమా ?

ప్రజాస్వామ్యం అంటే ప్రజలు అందరూ ఓట్లేసి పాలకుల్ని ఎంచుకోవడం. అయితే ఓట్లేసే వాళ్లను పరిమితం చేసి… ఓట్లను గల్లంతు చేసి.. తమకు అనుకూలమైన వాళ్లతోనే ఓట్లు వేయించుకుని గెలుస్తామంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది..?. టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత కూడా ఎవరి ఇష్టారీతిన వాళ్లు ఓట్లు తొలగించుకుని.. కావాల్సిన వారిని చేర్పించుకుని గెలవాలనుకుంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు ?. మెజార్టీప్రజల అభిప్రాయం ప్రకారమే పాలకులు ఉండాలి. ప్రజలు వ్యతిరేకిస్తారని ఓట్లే తీసేస్తే.. అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది. ప్రస్తుతం ఏపీలో అవే పరిస్థితులు ఉన్నాయి.

గుంటూరులో ఒక్క పోలింగ్ బూత్ వందల కొద్దీ దొంగ ఓట్లు

ఓటర్ల జాబితా ప్రకారం మచ్చుకు అక్కడక్కడా పరిశీలన జరిపితే గుంటూరులో శ్యామలా నగర్ అనే ప్రాంతంలో ఒక్క ఇంట్లోనే రెండు వందలకుపైగా దొంగ ఓట్లు నమోదు చేశారు. అది చిన్న విషయం కాదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం మీద ఇలా ఎన్ని ఓట్లు నమోదు చేశారో.. ఎంత మంది ఓట్లు తొలగించారో చెప్పడం కష్టం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారనుకున్న వారందరి ఓట్లు తొలగిస్తున్నారు. దొంగ ఓట్లు చేరుస్తున్నారు. ఇలా తొలగింపు ఎంత దారుణంగా సాగుతుందో.. విశాఖలో పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఓ పోలింగ్ బూత్ లో సగం మందిని తీసేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి.

ప్రజల ప్రాథమికహక్కును హరిస్తే ఇక ఎన్నికలు ఎందుకు ?

ఒక్క సారి ప్రజలు అధికారం ఇచ్చారని వారి ప్రాథమిక హక్కులుకూడా హరించి . ఎల్లకాలం తామే అధికారంలో ఉంటామని బలప్రయోగం చేసేదానికి ప్రజాస్వామ్యం ఎందుకు ? వెంటనే తమకు అలవాటైన రీతిలో వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఓటు హక్కు అని అర్థరాత్రి ఓ జీవో జారీ చేసేస్తే సరిపోతుంది. లేదా ఎన్నికలను రద్దు చేస్తున్నామని శాశ్వత ముఖ్యమంత్రిగా ప్రకటించుకుంటున్నామని చెప్పుకోవచ్చు. ఏం చేసినా ప్రజల కోరిక మేరకే అని చెప్పడం అలవాటు కాబట్టి.. అలాగే ప్రకటించేసుకుంటే.. ప్రజలకు కూడా ఓ బాధ తప్పుతుంది.

నేర మనస్థత్వం ఉన్న పాలకుల చేతిలో ప్రజాస్వామ్యం ఇంతే !

అత్యంత ఘోరమైన నేర, క్రూర మనస్థత్వం ఉన్న వారి చేతిలోకి పాలనా పగ్గాలు పోతే.. వ్యవస్థలన్నీ అంతే మారిపోతాయి. దానికి ఏపీనే ఉదాహరణ. తప్పుడు పనులుచేయడం ఏపీలో ఉన్న ప్రతి అధికారికి కామన్. జరిగిన తప్పుల్ని పట్టించుకోరు కానీ.. తప్పులు చేస్తారంటూ కొంత మందిని టార్గెట్ చేస్తారు. జరుగుతున్న అవినీతిని పట్టించుకోరు కానీ.. అప్పట్లో అవినీతి చేయబోయారని కేసులు పెడతారు. గెలవాలంటే.. అరాచకాలు చేయాల్సిందేనని.. డిసైడయ్యారు. రాజ్యాంగ వ్యవస్థలు ఓటర్ల ప్రాథమిక హక్కును కూడా కాపాడలేకపోతే ఈ దేశానికి ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close