స్వస్థిక్ గుర్తు లేకున్నా ఓటు చెల్లుబాటు..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో.. తెలంగాణ ఎస్‌ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా మారుతున్నాయి. కౌంటింగ్‌కు ముందు రోజు అర్థరాత్రి ఎస్‌ఈసీ ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ ప్రకారం.. బ్యాలెట్‌పై ఓటును స్వస్థిక్ గుర్తుతో కాకుండా.. మార్కర్ పెన్నుతో గుర్తించినా… పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే.. ఇతర రాజకీయ పార్టీలను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన ఉన్న వారిని విస్మయానికి గురి చేస్తోంది. విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసుకుని దానికి ఆమోద ముద్ర వేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం వారు విమర్శలు ప్రారంభించారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఈ సారి ఈవీఎంలు వాడలేదు. బ్యాలెట్ బాక్సులు వాడారు. ఈ కారణంగా.. బ్యాలెట్లపై ఓటింగ్ వేయాల్సి వచ్చింది. బ్యాలెట్ ఓటింగ్ విషయంలో ఎన్నికల కమిషన్ నియమ, నిబంధనలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఓటును ఖచ్చితంగా బ్యాలెట్ పై.. ఎన్నికల అధికారి ఇచ్చే స్వస్థిక్ మార్క్ గుర్తునే వేయాల్సి ఉంటుంది. అది కూడా.. అభ్యర్థి గుర్తుపైనే ఉండాలి. రెండుగుర్తులకు మధ్య ఉండకూడదు. బ్యాలెట్‌పై ఇతర ఏ రాతలు కనిపించినా… అది చెల్లుబాటయ్యే అవకాశం ఉంది. స్వస్థిక్‌ మార్క్‌తో కాకుండా.. మరో విధంగానూ ఓటును గుర్తించడానికి చాన్స్ లేదు. అయితే.. అనూహ్యంగా మార్కర్ పెన్నుతో ఓటేసినా… సరే.. పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశాలిచ్చేశారు.

అసలు మార్కర్ పెన్నుతో ఎవరు ఓటేస్తారు..? ప్రతీ ఓటర్‌కు పోలింగ్ అధికారి ఖచ్చితంగా ఇంకు అద్దిన స్వస్థిక్ మార్క్ ఇస్తారు. దాంతోనే.. ఓటర్ ఓటు వేస్తాడు. మార్కర్ పెన్నుతో ఓటేసే చాన్స్ లేదు. మరి ఎందుకు ఎస్‌ఈసీ కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసిందో.. ఎవరికీ అర్థం కాని విషయం. పోలింగ్ పర్సంటేజీ అనూహ్యంగా పెరగడం వెనుక రిగ్గింగ్ కారణం ఉందని.. ఆ రిగ్గింగ్‌ను .., పోలింగ్ సిబ్బందితో చేయించుకుని మార్కర్ పెన్నులు వాడారాని.. అందుకే ఈ కొత్త మార్గదర్శకాలు తెచ్చారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మార్కర్ పెన్నుతో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి.. వాటితో ఎన్నికల ఫలితాలు ఏమైనా తారుమారయ్యాయా అన్నదానిపైనే..ఈ అంశానికి సంబంధించి తదుపరి విాదం చెలరేగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close