బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచిన ” ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ “

‘నేను శైల‌జ’ త‌ర‌వాత ఫామ్ లోకి వ‌చ్చాడు రామ్‌. హైప‌ర్ కూడా ఓమాదిరి ఆడింది. అంత‌కు ముందు రామ్ ఇచ్చిన ఫ్లాప్స్ కంటే బెట‌ర్‌. అయితే ‘ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ’పైనా చాలా హోప్స్ పెట్టుకొన్నాడు రామ్‌. నేను శైల‌జ తీసిన‌ కిషోర్ తిరుమ‌ల‌కు మ‌రో అవ‌కాశం ఇచ్చాడు. ఈ సినిమా విడుద‌ల రోజు టాక్ బాగానే వినిపించింది. ఫ్రెండ్ షిప్‌ని బాగా చూపించాడ‌ని చెప్పుకొన్నారు. క్లీన్ సినిమా అని మెచ్చుకొన్నారు. శ‌ని, ఆదివారాలు నిల‌క‌డ‌గా క‌నిపించిన ఈ సినిమా… మెల్ల‌గా బ్రేక్ ఈవెన్‌లోకి వ‌చ్చేస్తుంద‌ని ఆశించారు. కాక‌పోతే… రాను రాను వ‌సూళ్లు పూర్తిగా ప‌డిపోయాయి. ఓ యావ‌రేజ్ సినిమాకి వ‌చ్చే వ‌సూళ్లు కూడా ఈ సినిమాకి రాలేదు.

పాజిటీవ్ టాక్ వ‌చ్చినా.. దాన్ని నిల‌బెట్టుకోవ‌డంలో చిత్ర‌బృందం ఎక్క‌డో త‌ప్పు చేసింది. దాంతో బ‌య్య‌ర్ల‌కు ఈ సినిమా న‌ష్టాల్ని మిగిల్చే ఛాన్స్ ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌క‌ట్టేశాయి. ఒక్కో ఏరియా నుంచి 30 నుంచి 40 శాతం వ‌ర‌కూ న‌ష్ట‌భారం మోయాల్సివ‌స్తోంద‌ట‌. మంచి టాక్ వ‌చ్చినా… అది వ‌సూళ్ల‌గా మ‌ల‌చ‌డంలో చిత్ర‌బృందం మొత్తం ఏక తాటిగా విఫ‌ల‌మైంది.
ట్రైల‌ర్లు కావ‌ల్సినన్ని క‌ట్ చేసినా, విడుద‌ల‌కు ముందు ప్ర‌మోష‌న్లు భారీగా న‌డిపినా.. ప్ల‌స్ కాలేదు. `నేను శైల‌జ‌` సినిమా ఫ్లేవ‌ర్ ముందు నుంచీ ఈ సినిమాకి అడ్డంకిగా మారింది. ఓ విధంగా వ‌సూళ్లు త‌క్కువ‌గా ఉండ‌డానికి అదీ ఓ కార‌ణ‌మే. విడుద‌ల త‌ర‌వాత ప‌బ్లిసిటీ ప్లానింగులూ స‌రిగా లేవు. పైగా వీక్ డేస్‌లో క్రౌడ్ పుల్లింగ్ అనేది ఓ ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. స్టార్ హీరోల సినిమాలు సైతం.. సోమ‌, మంగ‌ళ‌వారాల్లో బాగా డ‌ల్ అవుతోంది. ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై మ‌రింత ఎక్కువ ప‌డింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.